Share News

ఆ అధికారి పిటిషనా.. మా ముందుకు వద్దు

ABN , Publish Date - Sep 28 , 2026 | 06:08 AM

ఆయనో నిజాయితీపరుడైన అధికారి. అవినీతిని వెలికితీసిన ప్రతిసారీ బదిలీ అవడం, వేధింపులకు గురికావడం ఉద్యోగ జీవితంలో భాగంగా మారింది. ఈ వేధింపులపై ఆయన న్యాయస్థానాలను..

ఆ అధికారి పిటిషనా.. మా ముందుకు వద్దు

  • ఓ ఐఎఫ్‌ఎస్‌ అధికారి పిటిషన్‌ విచారణ నుంచి తప్పుకొన్న 17 మంది జడ్జీలు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 27: ఆయనో నిజాయితీపరుడైన అధికారి. అవినీతిని వెలికితీసిన ప్రతిసారీ బదిలీ అవడం, వేధింపులకు గురికావడం ఉద్యోగ జీవితంలో భాగంగా మారింది. ఈ వేధింపులపై ఆయన న్యాయస్థానాలను ఆశ్రయిస్తుంటే ఆ పిటిషన్లు తమ వద్దకు వద్దంటూ జడ్జీలు తప్పుకొంటున్నారు. ఒకసారో రెండుసార్లో కాదు..ఏకంగా 17 సార్లు ఇలాంటి పరిస్థితి ఎదురయింది. ఆ అధికారి పేరు సంజీవ్‌ చతుర్వేది. ఉత్తరాఖండ్‌ కేడర్‌కు చెందిన ఇండియన్‌ ఫారెస్టు సర్వీసు (ఐఎఫ్ఎస్‌) అధికారి. ఉన్నతస్థాయిలో జరిగే అవినీతిని వెలికితీస్తున్నందుకు 2015లో ప్రఖ్యాత రామన్‌ మెగసెసే అవార్డును కూడా అందుకున్నారు. 2013 నుంచి ఆయన కోర్టులను ఆశ్రయిస్తూ వస్తున్నారు. ఆయన వేస్తున్న కేసులు తమ వద్దకు వద్దంటూ అప్పటి నుంచి ఇంతవరకు 17 మంది జడ్జీలు తప్పుకొన్నారు. వీరిలో ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జీలు, నలుగురు హైకోర్టు జడ్జీలు, సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌(క్యాట్‌)కు చెందిన తొమ్మిది మంది సభ్యులు, ఇద్దరు జిల్లా జడ్జీలు ఉన్నారు. 2013లో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌, 2016లో జస్టిస్‌ యు.యు.లలిత్‌, 2019లో అప్పటి క్యాట్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి వంటి వారు ఆయన పిటిషన్లపై విచారణ జరిపేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు.

Updated Date - Sep 28 , 2026 | 06:09 AM