13 వేల కోట్ల డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారి వీరేందర్ బసోయాను అప్పగించిన యూఏఈ
ABN , Publish Date - Aug 15 , 2026 | 05:33 AM
అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో మోస్ట్ వాంటెడ్, డ్రగ్ మాఫియా సూత్రధారి వీరేందర్ సింగ్ బసోయాను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు ఎట్టకేలకు భారత్‌కు రప్పించారు.
ఇంటర్‌పోల్ సాయంతో తీసుకొచ్చిన ఎన్‌సీబీ
న్యూఢిల్లీ, ఆగస్టు 14: అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో మోస్ట్ వాంటెడ్, డ్రగ్ మాఫియా సూత్రధారి వీరేందర్ సింగ్ బసోయాను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు ఎట్టకేలకు భారత్‌కు రప్పించారు. రూ.13 వేల కోట్ల విలువైన డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో రెండేళ్లుగా పరారీలో ఉన్న బసోయాను ఇంటర్ పోల్ సాయంతో అదుపులోకి తీసుకుని భారత్‌కు తీసుకొచ్చారు. ఎన్‌సీబీ అభ్యర్థన మేరకు ఈ ఏడాది జూన్‌లో యూఏఈ పోలీసులు బసోయాను అరెస్టు చేశారు. ఎన్‌సీబీ అధికారులు అతన్ని యూఏఈ నుంచి భారత్‌కు తీసుకొచ్చారు. యూఏఈ బోసోయాను భారత్‌కు అప్పగించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ప్రకటించారు. డ్రగ్స్ మాఫియా విదేశాల్లో దాక్కున్నా సరే వేటాడుతామని ‘ఎక్స్’లో పేర్కొన్నారు.