గంగా నదిలో పడవ బోల్తా..13 మంది మృతి
ABN , Publish Date - Oct 14 , 2026 | 07:02 AM
బిహార్‌లోని వైశాలీ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రామ్‌పూర్ శ్యామ్‌చంద్ పంచాయతీ పరిధిలోని గంగా నదిలో మంగళవారం రాత్రి ఓ పడవ బోల్తా పడింది.
పట్నా, అక్టోబరు 13 : బిహార్‌లోని వైశాలీ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రామ్‌పూర్ శ్యామ్‌చంద్ పంచాయతీ పరిధిలోని గంగా నదిలో మంగళవారం రాత్రి ఓ పడవ బోల్తా పడింది.. ఈ ప్రమాదంలో గంగా నదిలో మునిగి 13 మంది ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు గల్లంతయ్యారు. ప్రాణాలతో బయటపడిన మరో ఏడుగురు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రామ్‌పూర్ శ్యామచంద్ గ్రామానికి చెందిన కొందరు ఓ వేడుక కోసం వెళుతుండగా వారు ప్రయాణిస్తున్న పడవ గంగా నదిలో బోల్తా పడింది.