Share News

శంషాబాద్‌లో 13 విమాన సర్వీసులు రద్దు

ABN , Publish Date - Mar 15 , 2026 | 06:34 AM

పశ్చిమాసియా గగనతలం మూసి వేయడంతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లాల్సిన 13 అంతర్జాయ విమాన సర్వీసులు రద్దయ్యాయి...

శంషాబాద్‌లో 13 విమాన సర్వీసులు రద్దు

శంషాబాద్‌ రూరల్‌, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియా గగనతలం మూసి వేయడంతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లాల్సిన 13 అంతర్జాయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతల కారణంగా గల్ఫ్‌ దేశాల గగనతలం మూసి వేశారు. దీంతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లాల్సిన 13 అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. అలాగే వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన మరో 15 విమాన సర్వీసులను నిలిపివేశారు. ఫిబ్రవరి 28 నుంచి గగనతలంపై ఆంక్షలు కొనసాగుతుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులు తెలిపారు.

Updated Date - Mar 15 , 2026 | 06:34 AM