Share News

నాలుగేళ్లలో 111 మంది జంప్‌జిలానీలు!

ABN , Publish Date - Sep 26 , 2026 | 05:32 AM

దేశవ్యాప్తంగా 2022 నుంచి ఇప్పటివరకు.. నాలుగేళ్లలో 111 మంది ఎన్నికైన ప్రజాప్రతినిధులు పార్టీలు ఫిరాయించారు. వీరిలో 78 మంది ఎమ్మెల్యేలు కాగా.. 33 మంది ఎంపీలున్నారు.

నాలుగేళ్లలో 111 మంది జంప్‌జిలానీలు!
adr

  • వీరిలో 33 మంది ఎంపీలు, 78 మంది ఎమ్మెల్యేలు

  • 81 మంది ఎన్‌పీఎఫ్‌, బీజేపీ, ఎన్‌సీపీఐలోకి జంప్‌

  • వెల్లడించిన ఏడీఆర్‌, ఎలక్షన్‌ వాచ్‌ సంస్థలు

  • ఫిరాయింపుల చట్టంలో మార్పులకు సూచన

  • అనర్హత పిటిషన్లపై నిర్ణయాధికారాన్ని

  • రాష్ట్రపతి, గవర్నర్లకు బదిలీచేయాలని సిఫారసు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 25: దేశవ్యాప్తంగా 2022 నుంచి ఇప్పటివరకు.. నాలుగేళ్లలో 111 మంది ఎన్నికైన ప్రజాప్రతినిధులు పార్టీలు ఫిరాయించారు. వీరిలో 78 మంది ఎమ్మెల్యేలు కాగా.. 33 మంది ఎంపీలున్నారు. ఎంపీల్లోనూ 26 మంది లోక్‌సభ, ఏడుగురు రాజ్యసభ సభ్యులు. ఈ వివరాలను ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్‌), నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ సంస్థలు వెల్లడించాయి. అత్యధికంగా ఎన్‌పీఎఫ్‌లోకి 32మంది ప్రజాప్రతినిధులు రాగా.. బీజేపీలోకి 29 మంది, ఎన్‌సీపీఐలోకి 20 మంది ఫిరాయించారు. 111మంది ప్రజాప్రతినిధుల్లో 81మంది (73శాతం) ఈ మూడు పార్టీల్లోకే వచ్చారు. ఫిరాయింపుల నిరోధక చట్టంలో పటిష్ఠ మార్పులు తీసుకురావలసిన అవసరం ఉందని ఏడీఆర్‌, ఎలక్షన్‌ వాచ్‌ సూచించాయి. ముఖ్యంగా ఎంపీలపై అనర్హత వేటు పిటిషన్లపై నిర్ణయాధికారాన్ని స్పీకర్‌/రాజ్యసభ చైర్మన్‌కు కాకుండా కేంద్ర ఎన్నికల కమిషన్‌ సిఫారసుతో రాష్ట్రపతికి.. ఎమ్మెల్యేల విషయంలో ఆ అధికారాన్ని గవర్నర్లకు బదిలీ చేయాలని సిఫారసు చేశాయి.

Updated Date - Sep 26 , 2026 | 05:37 AM