ఏడుగురు టీఎంసీ, ఇద్దరు కాంగ్రెస్ ఎంపీల గైర్హాజరు
ABN , Publish Date - Apr 18 , 2026 | 06:05 AM
రాజ్యాంగ సవరణ బిల్లుపై జరిగిన ఓటింగ్‌కు మొత్తంగా 11మంది ఎంపీలు గైర్హాజరయ్యారు. వీరిలో ఏడుగురు తృణమూల్ కాంగ్రె్‌సకు...
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ సవరణ బిల్లుపై జరిగిన ఓటింగ్‌కు మొత్తంగా 11మంది ఎంపీలు గైర్హాజరయ్యారు. వీరిలో ఏడుగురు తృణమూల్ కాంగ్రె్‌సకు చెందినవారే ఉన్నారని.. కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఎంపీలు, మరో ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా గైర్హాజరైనట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. గైర్హాజరైన టీఎంసీ ఎంపీల్లో దీపక్ అధికారి, రచనా బెనర్జీ, సయానీ ఘోష్, యూసఫ్ పఠాన్, జగదీశ్ చంద్రవర్మ, అభిషేక్ బెనర్జీ, పార్థా భౌమిక్ ఉన్నారు. కాంగ్రెస్ ఎంపీలు రాధాకృష్ణ దొడ్డమాని, ఆదూర్ ప్రకాశ్, స్వతంత్ర ఎంపీలు సరబ్‌జీత్ సింగ్ ఖల్సా, జైలులో ఉన్న ఖలిస్థానీ వాది అమృత్ పాల్ సింగ్ కూడా ఓటింగ్‌కు రాలేకపోయారు. కాగా ఎన్నికల సమయంలో పార్లమెంట్ సమావేశాలు జరపడం వల్లే తృణమూల్ ఎంపీలు హాజరుకాలేకపోయారని రాజకీయ వర్గాలు తెలిపాయి.