ఈ దిశలో కూర్చుని భోజనం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం.!
ABN , Publish Date - Aug 05 , 2026 | 03:11 PM
వాస్తు శాస్త్రం ప్రకారం.. భోజనం చేసే దిశ, ఆహారాన్ని గౌరవించే విధానం, కుటుంబంతో కలిసి భోజనం చేయడం వంటి కొన్ని అలవాట్లు ఇంట్లో సానుకూల వాతావరణాన్ని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో చేసే ప్రతి పనికీ ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా భోజనం చేసే విధానం, కూర్చునే దిశ గురించి కూడా కొన్ని సూచనలు ఉన్నాయి. వీటిని పాటిస్తే ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుందని, కుటుంబంలో ఆనందం, ఐక్యత పెరుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
కుటుంబంతో కలిసి భోజనం చేయాలి
శాస్త్రాల ప్రకారం.. ఆహారాన్ని ఎప్పుడూ గౌరవించాలి. భోజనం చేసే ముందు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పి, కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేస్తే పరస్పర ప్రేమాభిమానాలు పెరుగుతాయని నమ్మకం.
ఏ దిశలో కూర్చుని తినాలి?
వాస్తు ప్రకారం.. తూర్పు లేదా ఉత్తర దిశను చూసి కూర్చుని భోజనం చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల మనసుకు ప్రశాంతత లభించి, సానుకూల ఆలోచనలు పెరుగుతాయని చెబుతారు. అంతేకాకుండా, నేలపై పద్మాసనంలో లేదా కాళ్లు మడుచుకుని కూర్చుని, ప్లేటును నేలపై పెట్టుకుని భోజనం చేయడం మన భారతీయ సంప్రదాయం, ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఒళ్లో ప్లేటు పెట్టుకుని తినడం లేదా మంచంపై కూర్చుని తినడం మంచిది కాదని పెద్దలు చెబుతుంటారు.
ఆహారాన్ని వృథా చేయొద్దు
ఆహారాన్ని వృథా చేయడం మంచిది కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి అవసరమైనంత మాత్రమే వడ్డించుకుని, తీసుకున్న ఆహారాన్ని పూర్తిగా తినే అలవాటు చేసుకోవాలి.
ప్లేటులో చేతులు కడుక్కోవద్దు
వాస్తు నమ్మకాల ప్రకారం.. భోజనం చేసిన పళ్లెంలోనే చేతులు కడుక్కోవడం మంచిది కాదని చెబుతారు. ఇది ఆర్థిక ఇబ్బందులకు కారణమవుతుందని కొందరు విశ్వసిస్తారు.
ఆహారాన్ని అవమానించవద్దు
భోజనం చేస్తున్న సమయంలో మధ్యలో లేచి అటు ఇటు తిరగడం, ఆహారాన్ని నిర్లక్ష్యం చేయడం శాస్త్రాల ప్రకారం మంచిది కాదని భావిస్తారు. అందుకే భోజనాన్ని గౌరవంగా, ప్రశాంతంగా పూర్తి చేయాలని సూచిస్తారు.
Note: ఇందులోని సమాచారం సంప్రదాయ విశ్వాసాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ప్రెషర్ కుక్కర్ విజిల్ వేస్తూ నీరు కారుతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సమస్యకు చెక్
దానం చేసేటప్పుడు ఈ 5 తప్పులు చేయొద్దు