బస్సులను ఎవరు కనిపెట్టారో తెలుసా?
ABN , Publish Date - Feb 17 , 2026 | 08:58 PM
మనం రోజూ ప్రయాణించే బస్సుల చరిత్ర ఏమిటో? అసలు వ్యవస్థీకృత రవాణా వ్యవస్థను ప్రపంచానికి ఎవరు పరిచయం చేశారో? ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు బస్సులను వినియోగిస్తున్నారు. సామాన్యులకు అందుబాటులో ఉండే రవాణా సాధనాల్లో బస్సు కూడా ఒకటి. కానీ దీని చరిత్ర ఏమిటో? అసలు బస్సులను ఎవరు కనిపెట్టారో? చాలా మందికి తెలియదనే చెప్పాలి. మరి ఈ ఆసక్తికర విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం పదండి (History of Bus).
బస్ అనే పదానికి లాటిన్ భాషలో మూలాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆమ్నీబస్ అనే లాటిన్ పదానికి సంక్షిప్త రూపమే బస్. అందరి కోసం ఉద్దేశించిన ప్రయాణ సాధనం కాబట్టి దీనికి ఆమ్నీబస్ అనే పేరు స్థిరపడింది.
1600ల్లో గుర్రపు బగ్గీలను జనాలు వినియోగించేవారు. ఆ తరువాత 1662లో గణితశాస్త్రవేత్త బ్లెయిజ్ పాస్కల్ ప్రపంచంలోనే తొలి వ్యవస్థీకృత ప్రయాణ విధానాన్ని జనాలకు పరిచయం చేశారు. ఇందులో భాగంగా కొన్ని గుర్రపు బగ్గీలను ప్రత్యేక రూట్లల్లో నడిపించేవారు. 1820ల్లో స్టీమ్ ఇంజెన్ ఆధారిత బస్‌లు అందుబాటులోకి వచ్చాయి. అయితే, 1895లో పెట్రోల్‌తో నడిచే ఆధునిక బస్సును జర్మన్ ఇంజనీర్ కార్ల్ బెన్జ్ పరిచయం చేశారు. రవాణా రంగంలో ఇదో విప్లవానికి దారి తీసింది.
కాలక్రమంలో బస్సులు అనేక ఆధునిక హంగులను సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం విద్యుత్‌తో నడిచే బస్సులు కూడా అందుబాటులోకి వచ్చాయి. ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే డిజైన్‌లు, వసతులతో బస్సులు అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక టెక్నాలజీ ఉండే స్మార్ట్ బస్సులు కూడా జనాలను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇవి కూడా చదవండి:
విహారయాత్రకు వెళ్లే వారి స్మార్ట్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన యాప్స్ ఇవి
ఫ్లైట్ ఆలస్యమైందా.. సడెన్‌గా క్యాన్సిల్ అయ్యిందా.. పరిహారం ఎంతిస్తారో తెలుసా
మరిన్ని ట్రావెల్ వార్తల కోసం క్లిక్ చేయండి