Share News

ప్రపంచంలో అత్యంత బలహీన పాస్‌పోర్టు ఇదే!

ABN , Publish Date - Feb 16 , 2026 | 10:04 PM

అఫ్గానిస్థాన్ పాస్‌పోర్టు ప్రపంచంలోనే అత్యంత బలహీనమైనదిగా నిలిచింది. అఫ్గానిస్థానీలకు కేవలం 24 దేశాల్లో మాత్రమే వీసా ఫ్రీ, వీసా ఆన్ అరైవల్ వంటి సులభతర ప్రయాణ అనుమతులను జారీ చేస్తున్నాయి.

ప్రపంచంలో అత్యంత బలహీన పాస్‌పోర్టు ఇదే!
Afghanistan passport weakest in world

ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్ (Afghanistan) పాస్‌పోర్టు ప్రపంచంలోనే అత్యంత బలహీనమైనదిగా తేలింది(Weakest Passport). ఈ పాస్‌పోర్టు ఉన్న వారికి కేవలం 24 దేశాలకు ముందస్తు వీసా లేకుండా వెళ్లేందుకు అవకాశం ఉంది. ఫిబ్రవరి హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్‌‌లో అఫ్గానిస్థాన్‌కు 101వ స్థానం దక్కింది. ఇతర దేశాలన్నిటికంటే చిట్టచివరన అఫ్గానిస్థాన్ నిలిచింది. అయితే, అఫ్గానిస్థాన్ పాస్‌పోర్టును గుర్తించే ప్రభుత్వాలు అఫ్గానీలకు వీసా ఫ్రీ, వీసా ఆన్ అరైవల్, లేదా ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథొరైజేషన్ (ఈటీఏ) ద్వారా తమ దేశాల్లోకి అనుమతిస్తున్నాయి ప్రస్తుతం అఫ్గానీలు తమ పొరుగున ఉన్న కొన్ని దేశాలతో పాటు చిన్న చిన్న ద్వీప దేశాలు, ఆఫ్రికా దేశాలకు సులభంగా వెళ్లిరావచ్చు. ఈ జాబితాలో బంగ్లాదేశ్ కూడా ఉండటం విశేషం.

హెన్లీ పాస్‌పోర్డు ఇండెక్స్ ప్రకారం, అఫ్గానీలకు కుక్ ఐల్యాండ్స్, డొమినికా, హైతీ, మైక్రోనేషియా దేశాలు వీసా ఫ్రీ పర్యటనకు అనుమతి ఇస్తున్నాయి. మెడగాస్కర్, బంగ్లాదేశ్, బురుండీ, కాంబోడియా, కేప్ వర్డే ఐల్యాండ్స్, కొమొరోస్, గినియా బిసూ, మకావో, మాల్దీవులు, మొజాంబిక్, రువాండా, సమోవా, టిమోర్ లెస్టే, టువాలూ, జిబోటీ, నూయీ దేశాలు అఫ్గానీలకు వీసా ఆన్ అరైవల్ ఆప్షన్ ఇచ్చాయి. శ్రీలంక, కెన్యా, సీషెల్స్ దేశాలకు ఈటీఏ డాక్యుమెంట్‌తో అప్ఘానీలు వెళ్లొచ్చు.


అంతర్జాతీయంగా దౌత్య సంబంధాలు నెరపడంలో బాగా వెనకబడ్డ కారణంగా అఫ్గానిస్థాన్ అత్యంత బలహీన దేశంగా మిగిలింది. భద్రతా కారణాలు, అంతర్జాతీయ ఆంక్షలు కూడా అఫ్గానిస్థాన్‌ను చిట్టచివరకు నెట్టాయి. ఇక సింగపూర్, జపాన్, దక్షిణ కొరియా దేశాలతో పాటు అనేక ఐరోపా దేశాలు ఈసారి ఇండెక్స్‌లో ముందువరుసలో నిలిచాయి.


ఇవి కూడా చదవండి:

విహారయాత్రకు వెళ్లే వారి స్మార్ట్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన యాప్స్ ఇవి

ఫ్లైట్ ఆలస్యమైందా.. సడెన్‌గా క్యాన్సిల్ అయ్యిందా.. పరిహారం ఎంతిస్తారో తెలుసా

మరిన్ని ట్రావెల్ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 16 , 2026 | 10:16 PM