Share News

వినాయక చవితి వేడుకల్లో టిఫనీ ట్రంప్.. భారతీయ దుస్తుల్లో మెరిసిన వైనం

ABN , Publish Date - Sep 17 , 2026 | 05:49 PM

అంబానీ ఇంట జరిగిన వినాయక చవితి వేడుకల్లో ట్రంప్ కుమార్తె టిఫనీ తన భర్త, కుమారుడు, తల్లితో కలిసి పాల్గొన్నారు. భారతీయ దుస్తుల్లో ఆమె ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.

 వినాయక చవితి వేడుకల్లో టిఫనీ ట్రంప్.. భారతీయ దుస్తుల్లో మెరిసిన వైనం
Tiffany Trump in Ganesh Chaturthi Celebrations

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ ఇంట వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. దేశంలోని పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే, ఈ వేడుకల్లో ట్రంప్ కూతురు టిఫనీ ట్రంప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భర్త, తల్లి, కుమారుడితో కలిసి భారత పర్యటనకు వచ్చిన ఆమె అంబానీల ఆహ్వానం మేరకు వినాయక చవితి, గణేశ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటో కూడా ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు.


ముంబైలోని అంబానీల నివాసం యాంటీలియాలో ఈ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో ట్రంప్ కుమార్తె భారతీయ సంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యారు. ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్రా వీటిని డిజైన్ చేశారు. పాస్టెల్ పిస్టాచియో- గ్రీన్ రంగు లెహెంగా, బ్లష్-కోరల్ పింక్ రంగు దుపట్టాలో ఆమె మెరిసిపోయారు. సన్నని థ్రెడ్ వర్క్, పెర్ల్ ఎంబెల్లిష్‌మెంట్, పూల డిజైన్‌లతో మనీశ్ ఈ డ్రెస్‌ను డిజైన్ చేశారు. నెక్‌లైన్‌లో ఐవరీ ఎంబెల్లిష్‌మెంట్‌ను జోడించడంతో నెక్లెస్ ధరించినట్టు అనిపిస్తుంది. డ్రెస్‌కు మ్యాచ్‌ అయ్యేలా పోల్కీ నగల సెట్‌‌ను ఆమె ధరించారు. స్పష్టంగా కనిపించేలా నెక్లెస్, షాండలియర్‌ ఆకారంలోని చెవి కమ్మలు వంటివి ధరించి సంప్రదాయ లుక్‌లో వేడుకలకు హాజరయ్యారు.


యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు టిఫనీ నాలుగో సంతానం. ఆమె తల్లి మార్లా. తాజా పర్యటనలో ఆమె కూతురి వెంట ఉన్నారు. భర్త మైఖేల్ బూలోస్, కుమారుడు అలెగ్జాండర్‌తో కలిసి ఈ వేడుకల్లో టిఫనీ పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఒడిశా టూర్‌కు IRCTC ప్రత్యేక ప్యాకేజీ.. పూర్తి వివరాలు ఇవే

మిక్స్‌డ్ ఫ్రూట్స్ తింటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

Updated Date - Sep 17 , 2026 | 06:06 PM