Share News

మందార మొక్క.. ఇంట్లో ఈ దిశలో ఉంటే డబ్బే.. డబ్బు

ABN , Publish Date - Jul 17 , 2026 | 03:18 PM

మీ ఇంట్లో మందార మొక్క ఉందా? వాస్తు శాస్త్రం ప్రకారం దీనిని సరైన దిశలో ఉంచితే ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుందని చెబుతారు. మరి మందార మొక్కకు అనుకూలమైన దిశ ఏది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..

మందార మొక్క.. ఇంట్లో ఈ దిశలో ఉంటే డబ్బే.. డబ్బు
Hibiscus Plant Vastu Tips

ఇంటర్నెట్ డెస్క్: ఇంట్లో మొక్కలు పెంచడం వల్ల పచ్చదనం పెరగడమే కాదు, ఆహ్లాదకరమైన వాతావరణం కూడా ఏర్పడుతుంది. వాస్తు శాస్త్రంలో కొన్ని మొక్కలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అలాంటి వాటిలో మందార మొక్క ఒకటి. ముఖ్యంగా ఎర్ర మందార పువ్వు దుర్గాదేవి, కాళీమాత, శ్రీ గణేశుడికి ఎంతో ప్రీతిపాత్రమైనదిగా భావిస్తారు. అందుకే చాలా మంది తమ ఇళ్లలో ఈ మొక్కను పెంచుతుంటారు.


ఏ దిశలో నాటితే శుభం?

వాస్తు శాస్త్రం ప్రకారం.. తూర్పు లేదా ఉత్తర దిశలో మందార మొక్కను నాటడం శుభప్రదంగా భావిస్తారు. ఈ దిశల్లో మొక్కను ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం, ప్రశాంతత, శ్రేయస్సు పెరుగుతాయని చెబుతారు. తూర్పు దిశలో ఎర్ర మందార మొక్కను పెంచడం వల్ల సూర్యుని అనుకూల ప్రభావం లభిస్తుందని కూడా నమ్ముతారు.


పూజలో మందార పువ్వు ప్రాముఖ్యం

వాస్తు నమ్మకాల ప్రకారం.. ఎర్ర మందార పువ్వులను దేవతలకు సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా మంగళవారం, శుక్రవారం జరిగే పూజల్లో ఈ పువ్వును వినియోగించే సంప్రదాయం ఉంది. ఇలా చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని, కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం నెలకొంటుందని, ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయని కొందరు విశ్వసిస్తారు. అలాగే ఆర్థిక అభివృద్ధికి కూడా ఇది అనుకూలంగా ఉంటుందని వాస్తు నమ్మకాలు చెబుతున్నాయి.


Note: ఇందులోని సమాచారం వాస్తు శాస్త్రంలో పేర్కొన్న విశ్వాసాలు, సంప్రదాయాల ఆధారంగా మాత్రమే మీకు అందించడం జరుగుతోంది. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

ఫ్రిజ్ లేకుండానే టమోటాలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా?

ఈ తేదీల్లో పుట్టినవారిది రాజసమైన వ్యక్తిత్వం..!

Updated Date - Jul 17 , 2026 | 03:18 PM