Share News

పరగడుపున జిమ్‌లో కసరత్తులు చేయవచ్చా?

ABN , Publish Date - Mar 30 , 2026 | 10:11 PM

పరగడుపున జిమ్‌లో కసరత్తులు చేస్తే బరువు త్వరగా తగ్గవచ్చా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఈ విషయంలో వైద్యులు ఏం చెబుతున్నారో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

పరగడుపున జిమ్‌లో కసరత్తులు చేయవచ్చా?
Workout Benefits

ఇంటర్నెట్ డెస్క్: పరగడుపున జిమ్‌కు వెళ్లి కసరత్తులు చేయడమనే ట్రెండ్ ఇటీవల కాలంలో ఊపందుకుంది. జనాలు దీన్ని ఫాస్టెడ్ ఎక్సర్‌సైజ్ అని పిలుస్తున్నారు. త్వరగా బరువు తగ్గాలనుకునే వారు ఇలాంటి కసరత్తులవైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఇలాంటి ప్రయత్నాలు చేసే ముందు కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

రాత్రి భోజనం తరువాత పడుకుని తెల్లారి నిద్రలేచేటప్పటికి శరీరంలో ఇన్సులీన్ స్థాయి తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గ్లైకోజన్ నిల్వలు కూడా తగ్గుతాయి. ఈ సమయంలో శరీరంలోని నిల్వ ఉన్న కొవ్వు ద్వారా శక్తి ఉత్పత్తి మొదలవుతుంది. కాబట్టి ఈ సమయంలో జిమ్‌కు వెళ్లి కసరత్తులు చేస్తే కొవ్వును మరింత సమర్థవంతంగా వదిలించుకోవచ్చని కొందరు భావిస్తుంటారు. అయితే, ఇందులో పూర్తిగా నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రోజు మొత్తంలో ఎన్ని కెలొరీలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటున్నామనే దానిపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. పరగడుపున జిమ్ చేసి వచ్చాక ఆకలితో అతిగా తినేస్తే చివరకు ఆశించిన ఫలితం దక్కదని చెబుతున్నారు.


ఇక పరగడుపున వాకింగ్, కార్డియో, సైక్లింగ్ లేదా ఓ మోస్తరు స్థాయిలో జాకింగ్ వంటి కసరత్తులతో శరీరంపై మరీ అంత ఎక్కువ ఉండదని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే, తీవ్రస్థాయి కసరత్తులు చేస్తే మాత్రం బలహీనత ఆవరించడం, తల తిరిగినట్టు ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు. ఇక జిమ్‌లో శ్రమించే సామర్థ్యం కూడా తగ్గుతుందని చెబుతున్నారు. అంతిమంతగా కండరాల పెరుగుదలపై ఇది ప్రభావం చూపుతుందని అంటున్నారు. కాబట్టి, శారీర దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని భావించే వారికి ఇలాంటి కసరత్తు తగదని చెబుతున్నారు.


ఈ వార్తలూ చదవండి:

ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్.. ఈ ప్యాకేజీ మిస్ అవ్వకండి

అంతా కోల్పోయినప్పుడు ఏం చేయాలో తెలుసా?

Updated Date - Mar 31 , 2026 | 04:56 PM