Share News

Exercise-related Amenorrhoea: వ్యాయామం వ్యసనంగా మారడంతో యువతికి షాక్.. 23 ఏళ్ల వయసులోనే..

ABN , Publish Date - Jan 11 , 2026 | 09:37 PM

వ్యాయామం వ్యసనంగా మారిన ఓ యువతికి 23 ఏళ్ల వయసులోనే ఊహించని షాక్ తగిలింది. నెలసరి నిలిచిపోవడంతో ఆమె ఆసుపత్రి పాలైంది. తిండి తగ్గించి అతిగా కసరత్తులు చేస్తే ఇలాగే జరుగుతుందని వైద్యులు చెప్పారు.

Exercise-related Amenorrhoea: వ్యాయామం వ్యసనంగా మారడంతో యువతికి షాక్.. 23 ఏళ్ల వయసులోనే..
Exercise-related Amenorrhoea:

ఇంటర్నెట్ డెస్క్: చైనాలో తాజాగా ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. బరువు తగ్గేందుకు అతిగా కసరత్తులు చేసిన ఓ 23 ఏళ్ల యువతికి నెలసరి నిలిచిపోయింది. 50 ఏళ్ల మహిళకు ఉండే స్థితిలో యువతిలోని హార్మోన్‌లు ఉన్నాయని వైద్యులు చెప్పారు (Intense Exercise - Menstrual Cycle Halt).

ఒకప్పుడు యువతి ఊబకాయంతో బాధపడేది. దీంతో, బరువుపై అదుపు కోసం కసరత్తులు ప్రారంభించింది. అంతేకాకుండా, తిండి కూడా తగ్గించేసింది. వారానికి ఆరు రోజులు జిమ్‌కు వెళ్లి కసరత్తులు చేయడం ప్రారంభించింది. చివరకు ఇది వ్యసనంగా మారింది. రోజుకు కనీసం 70 నిమిషాల పాటు జిమ్‌లోనే గడిపేది. ఈ క్రమంలోనే ఆమెకు తన శరీరంలో మార్పులు కనిపించాయి. నెలసరి రావడం చాలా వరకూ తగ్గిపోయింది. నెలసరి దినాల్లో డిశ్చార్జ్ కూడా చాలా తగ్గిపోయింది.


వెంటనే ఆమె వైద్యులను సంప్రదించింది. పలు పరీక్షలు చేసిన వైద్యులు ఆమె అనారోగ్యంతో ఉన్నట్టు గుర్తించారు. ఆమెకు కిడ్నీ సమస్యలు ఉన్నట్టు తెలిపారు. వెంటనే కసరత్తులను ఆపేయాలన్నారు. శరీరంలో వ్యవస్థలు మళ్లీ సమతౌల్యం సాధించేందుకు చైనా సంప్రదాయక వైద్య విధానాలతో చికిత్స చేస్తున్నారు.

కసరత్తులు, ఆహారం విషయంలో సమతౌల్యం పాటించనప్పుడు ఇలాంటి పరిస్థితి తలెత్తుతుందని వైద్యులు తెలిపారు. అతిగా కసరత్తులు చేసి ఆహారం తక్కువగా తీసుకుంటే శక్తి చాలక సంక్షోభం తలెత్తుతుందని అన్నారు. ఈ విపత్కర పరిస్థితులకు అనుగుణంగా శరీరంలో మార్పులు వస్తాయని అన్నారు. మెదడు నుంచి గొనాడోట్రాపిన్స్ అనే హార్మోన్‌ల విడుదల తగ్గి పునరుత్పత్తి సంబంధిత ప్రక్రియలు నిలిచిపోతాయని చెప్పారు. ఫలితంగా అండం విడుదల ఆగిపోయి నెలసరి నిలిచిపోతుందని వివరించారు.


ఇవీ చదవండి:

ఇయర్ ఫోన్స్‌ సౌండ్ ఎంత వరకూ ఉండవచ్చో తెలుసా?

ఉదయం పూట ఇలా చేస్తారా.. చిన్నతనంలోనే వార్ధక్య లక్షణాలు వస్తాయి జాగ్రత్త!

Updated Date - Jan 11 , 2026 | 09:49 PM