Share News

డ్యుయల్ ఇన్వర్టర్ ఏసీ వర్సెస్ సింగిల్ ఇన్వర్టర్ ఏసీ.. ఏది బెటర్?

ABN , Publish Date - Jul 18 , 2026 | 08:53 PM

డ్యుయల్ ఇన్వర్టర్, సింగిల్ ఇన్వర్టర్ ఏసీల్లో ఏది ఎంచుకోవాలనే సందేహం ఉన్న వారికి నిపుణులు కొన్ని సలహాలు ఇస్తున్నారు. అవేంటంటే..

డ్యుయల్ ఇన్వర్టర్ ఏసీ వర్సెస్ సింగిల్ ఇన్వర్టర్ ఏసీ.. ఏది బెటర్?
Dual Inverter Vs Single Inverter AC

ఇంటర్నెట్ డెస్క్: ఇన్వర్టర్ ఏసీని కొనుగోలు చేసే సమయంలో కేవలం వాటి సామర్థ్యం చూస్తే సరిపోదని నిపుణులు చెబుతున్నారు. డ్యుయల్ ఇన్వర్టర్ ఏసీ, సింగిల్ ఇన్వర్టర్ ఏసీల మధ్య తేడాలు తెలుసుకుంటే అవసరాలకు తగిన ఏసీ ఎంచుకోవడం సులువవుతుందని చెబుతున్నారు.

నిపుణులు చెప్పేదాని ప్రకారం, సంప్రదాయక ఎయిర్ కండీషనర్లతో పోలిస్తే డ్యుయల్, సింగిల్ ఇన్వర్టర్ ఏసీల విద్యుత్ వినియోగం తక్కువగానే ఉంటుంది. అయితే, కంప్రెసర్ టెక్నాలజీ, కూలింగ్ సామర్థ్యం, శబ్ద తీవ్రత, దీర్ఘకాలిక నిర్వహణ ఖర్చుల విషయంలో ఈ రెండిటి మధ్య కొంత తేడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. డ్యుయల్ ఇన్వర్టర్ ఏసీలతో గది త్వరగా చల్లబడుతుంది. విద్యుత్ వినియోగం కూడా తక్కువగా ఉంటుంది. ఇక సింగిల్ ఇన్వర్టర్ ఏసీలు విశ్వసనీయమైన పనితీరు కనబరుస్తాయని నిపుణులు చెబుతున్నారు.


ఏసీల ఎంపిక ఇలా..

ఏసీ ధర అందుబాటులో ఉండాలని అనుకునే వారు, రోజులో కొన్ని గంటలు మాత్రమే ఏసీని వాడేవారు, చిన్న, మధ్యస్థాయి గదులు ఉన్న వారు, ఓమోస్తరు స్థాయిలో విద్యుత్ ఆదా అయితే చాలు అని అనుకునే వారికి సింగిల్ ఇన్వర్టర్ ఏసీ మేలని నిపుణులు చెబుతున్నారు.

అయితే, గరిష్ఠ స్థాయిలో విద్యుత్ ఆదాను కోరుకునే వారు డ్యుయల్ ఇన్వర్టర్ ఏసీని ఎంచుకోవడం ఉత్తమం. రోజులో ఎక్కువ సేపు ఏసీని వాడే వారు, వేడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసించే వారు, వేగంగా గది చల్లబడాలని భావించే వారికి డ్యుయల్ ఇన్వర్టర్ ఏసీ ఉత్తమం. ఈ ఏసీతో శబ్దం కూడా తక్కువని అనుభవజ్ఞులు చెబుతున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

వీకెండ్ ట్రిప్‌కు కొత్త ట్రెండ్.. హైదరాబాద్‌లో కారవాన్ బుకింగ్స్ జోరు

వర్షాకాలంలో తప్పనిసరిగా తినాల్సిన పండ్లు ఇవే.!

Updated Date - Jul 18 , 2026 | 09:05 PM