Share News

అబ్బో.. దోస.. ప్రపంచంలో 6వ ర్యాంకు

ABN , Publish Date - May 01 , 2026 | 07:15 PM

ఉదయం పూట ప్రజలు అల్పాహారంగా తీసుకునే పలు రకాల ప్యాన్‌కేక్స్‌లో దోసకు తాజాగా ఆరవ స్థానం దక్కింది. ఈ ఏడాది మే నెలకు గాను టేస్ట్‌అట్లాస్ ర్యాంకింగ్స్‌లో దోసకు ఈ స్థానం దక్కినట్టు వెల్లడైంది.

అబ్బో.. దోస.. ప్రపంచంలో 6వ ర్యాంకు

ఇంటర్నెట్ డెస్క్: భారతీయులందరికీ నచ్చే దోసకు ప్రపంచం వ్యాప్తంగా ప్రజాదరణ పెరుగుతోంది. ఉదయం పూట ప్రజలు అల్పాహారంగా తీసుకునే 100 రకాల ప్యాన్‌‌కేక్స్‌లో దోసకు తాజాగా ఆరవ స్థానం దక్కింది. ఈ ఏడాది మే నెలకు గాను టేస్ట్‌అట్లాస్ ర్యాంకింగ్స్‌లో దోసకు ఈ స్థానం దక్కినట్టు వెల్లడైంది. 4.3 స్టార్ రేటింగ్ దక్కింది. యూజర్లు, పాకశాస్త్ర నిపుణుల అభిప్రాయాల ఆధారంగా దోసకు ఈ ర్యాంకు దక్కింది.

దోసకు ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పెరుగుతోందని అనేక మంది భారతీయ షెఫ్‌లు చెబుతున్నారు. కొందరు మాత్రం మరో వాదనను తెరపైకి తెస్తున్నారు. దోస ఎప్పటికీ బెస్ట్ వంటకమైనా పాశ్చాత్య ధోరణుల్లో ఈ మధ్య కాలంలో మేలి మార్పులు వస్తున్నాయని అంటున్నారు.


గోధుమ పిండికి నీరు, పాలు, కోడి గుడ్లు కలిపి పేస్టులా చేసి పెనంపై రొట్టెలాగా కాల్చి చేసే వంటకాన్ని ప్యాన్‌కేక్ అని పిలుస్తారు. పులియబెట్టిన పిండితో దాదాపు ఇదే విధానంలో దోసను చేస్తారు. ఇక దోసను కొందరు ఆరోగ్యకరమైన ప్యాన్‌‌కేక్ అని కూడా పిలుస్తుంటారు. జనాల ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన మైసూర్ మసాలా దోసతో పాటు జన్ జీ తరం మెచ్చిన ఆవకాడో దోస వరకూ ప్రస్తుతం అనేక రకాల దోసలు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.


ఈ వార్తలనూ చదవండి:

మిక్సర్ గ్రైండర్ బ్లేడ్లను ఇంట్లోనే ఇలా పదును పెట్టండి

కూలర్‌ నుంచి వచ్చే దుర్వాసనను ఇలా తొలగించుకోండి

Updated Date - May 01 , 2026 | 08:23 PM