అనిరుధ్- కావ్యామారన్ వెడ్డింగ్ రిసెప్షన్.. ఆహ్వానం అదుర్స్
ABN , Publish Date - Oct 27 , 2026 | 05:12 PM
కావ్యా మారన్, అనిరుధ్ రవిచందర్ వెడ్డింగ్ రిసెప్షన్‌కు సంబంధించిన ఆహ్వాన పత్రిక ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కోఓనర్ కావ్యామారన్ పెళ్లికి వడివడిగా ఏర్పాట్లు సాగుతున్నాయి. గ్రీస్‌లో ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నట్టు మీడియాలో కథనాలు వెలువడుతున్నప్పటికీ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. అయితే, రిసెప్షన్ మాత్రం చెన్నైలో నవంబర్ 21న జరగనుంది. ఈ ఈవెంట్‌కు సంబంధించి ఆహ్వానాలు కూడా సిద్ధమయ్యాయి. ఈ ఇన్విటేషన్ బాక్స్ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతూ జనాలను ఆశ్చర్యపరుస్తున్నాయి.
ఇన్విటేషన్ బాక్స్‌ను అత్యంత అద్భుతంగా డిజైన్ చేయడంతో నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది. ఐవరీ రంగు బాక్స్‌పై లేత నీలి రంగు ఎంబ్రాయిడరీతో ఇన్విటేషన్ బాక్స్ చూపు తిప్పుకోనీయకుండా ఉందని అనేక మంది కామెంట్ చేశారు. బాక్స్‌పై ఎంబాస్డ్ అక్షరాలు, వింటేజ్ లుక్స్ ఉన్న సీల్ ఈ బాక్స్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఇక ఈ రిసెప్షన్‌కు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్టు తెలుస్తోంది. ప్రధాని మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి సీ జోసెఫ్ విజయ్, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డిలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్టు సమాచారం. సన్‌గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్, ఆయన భార్య కావేరీ మారన్ స్వయంగా ప్రముఖులను ఆహ్వానించారు. అనిరుధ్ తల్లిదండ్రులు యాక్టర్ రవి రాఘవేంద్ర, లక్ష్మీ రవిచందర్‌లతో పాటు కావ్య తల్లిదండ్రులు వెళ్లి ప్రధాని మోదీని ఆహ్వానించారు. ఇక సినీ రంగానికి చెందిన ప్రముఖులు రజినీకాంత్, ఏఆర్ రెహ్మాన్, హీరో అజిత్ కుమార్, టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ కూడా రిసెప్షన్‌కు హాజరుకానున్నట్టు తెలుస్తోంది.
ఈ వార్తలనూ చదవండి:
జాకెట్టు... కనికట్టు... ఫ్యాషన్‌లో కొత్త ట్రెండ్స్
పెళ్లి గురించి కల వచ్చిందా? శుభమో.. అశుభమో తెలుసుకోండి!