Share News

అమెరికాలోని స్కూళ్లకు యూట్యూబ్‌ రూ.27 వేల కోట్ల పరిహారం!

ABN , Publish Date - Nov 23 , 2026 | 03:54 AM

విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందన్న ఆరోపణల నేపథ్యంలో అమెరికాలోని వేలాది పాఠశాలలతో యూట్యూబ్‌ సుమారు రూ.27 వేల కోట్ల (3 బిలియన్‌ డాలర్ల) పరిహారం..

అమెరికాలోని స్కూళ్లకు యూట్యూబ్‌ రూ.27 వేల కోట్ల పరిహారం!

న్యూయార్క్‌, నవంబరు 22: విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందన్న ఆరోపణల నేపథ్యంలో అమెరికాలోని వేలాది పాఠశాలలతో యూట్యూబ్‌ సుమారు రూ.27 వేల కోట్ల (3 బిలియన్‌ డాలర్ల) పరిహారం చెల్లించడానికి సిద్ధమైనట్లు తెలిసింది. విద్యార్థులను వీడియోలకు బానిసలుగా మార్చేలా తన ప్లాట్‌ఫామ్‌ను రూపొందించిందని, త ద్వారా వారి మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిందని అమెరికాలోని వేలాది స్కూల్‌ డిస్ట్రిక్ట్‌లు ఆరోపణలు చేశాయి. ఈ క్రమంలో ఆయా పాఠశాలలకు 3బిలియన్‌ డాలర్లు పరిహారంగా చెల్లించేందుకు యూట్యూబ్‌ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు బ్లూమ్‌బర్గ్‌ వెల్లడించింది. ఈ పరిహారం చెల్లింపు అమలైతే అమెరికాలో పాఠశాల జిల్లాలతో ఒక సంస్థ కుదుర్చుకున్న అతిపెద్ద ఒప్పందంగా నిలవనుంది.

Updated Date - Nov 23 , 2026 | 03:59 AM