4.5 కోట్ల మందికి ఆహార సంక్షోభం!
ABN , Publish Date - Mar 19 , 2026 | 06:24 AM
ఒకవేళ పశ్చిమాసియాలో యుద్ధం జూన్ వరకు కొనసాగితే కొన్ని ప్రాంతాల్లో ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని.. సుమారు 4.5 కోట్ల మంది ఆకలితో...
ఒకవేళ పశ్చిమాసియాలో యుద్ధం జూన్ వరకు కొనసాగితే కొన్ని ప్రాంతాల్లో ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని.. సుమారు 4.5 కోట్ల మంది ఆకలితో అలమటించాల్సి వస్తుందని ఐక్యరాజ్యసమితి ‘ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎ్‌ఫపీ)’ పేర్కొంది. చమురు కొరత, రవాణా వ్యయం పెరిగిపోవడంతో ఆహార పదార్థాల ధరలు పెరుగుతున్నాయని, యుద్ధం కొనసాగితే పరిస్థితి మరింత దిగజారుతుందని డబ్ల్యూఎ్‌ఫపీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కార్ల్ స్కావ్ పేర్కొన్నారు. యుద్ధ పరిస్థితులతో డబ్ల్యూఈపీకి అందే విరాళాలు తగ్గే అవకాశముందని, ధరల పెరగడంతో పంపిణీ చేసే ఆహారం తగ్గుతుందని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
అక్రమవలసదారులకు అమెరికా ఆఫర్.. దేశం నుంచి వెళ్లిపోతే రూ.2.4 లక్షలు..
మీది డేగ చూపు అయితే.. ఈ అడవిలో చిరుతను 5 సెకెన్లలో కనిపెట్టండి..