బలూచ్‌లో భారీ హింస..88 మందికి పైగా మృతి
ABN , Publish Date - Feb 01 , 2026 | 04:36 AM
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ రాష్ట్రం తీవ్రస్థాయి హింసాత్మక ఘటనలతో మరోసారి నెత్తురోడింది.
ఇస్లామాబాద్/కరాచీ, జనవరి 31: పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ రాష్ట్రం తీవ్రస్థాయి హింసాత్మక ఘటనలతో మరోసారి నెత్తురోడింది. రాష్ట్రంలో పెద్దఎత్తున చెలరేగిన ఘర్షణల్లో కనీసం 67 మంది ఉగ్రవాదులు, 10 మంది భద్రతా సిబ్బంది, 11 మంది పౌరులు మృతిచెందారు. మరణించిన ఉగ్రవాదుల్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ)కి చెందిన కొంతమంది వేర్పాటు వాదులు కూడా ఉన్నట్లు అధికారులు, సంబంధిత మంత్రులు శనివారం వెల్లడించారు. పాకిస్థాన్‌లోని అతిపెద్ద రాష్ట్రమైన బలూచిస్థాన్ అనేక దశాబ్దాలుగా వేర్పాటువాదంతో అట్టుడుకుతోంది. నిరుడు దేశవ్యాప్తంగా 699 ఉగ్రదాడులు జరిగాయని, అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 34శాతం అధికమని పాక్ తెలిపింది.