Share News

బొద్దింకగా మారిపోవాలేమో..!?

ABN , Publish Date - Sep 11 , 2026 | 05:46 AM

భారత్‌లో తనపై జరుగుతున్న న్యాయపరమైన చర్యలు, బ్యాంకు రుణాల ఎగవేత వ్యవహారంపై వ్యాపారవేత్త విజ య్‌ మాల్యా మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

బొద్దింకగా మారిపోవాలేమో..!?

  • రూ.14 వేల కోట్లు చెల్లించినా.. ఇంకా మోసగాడంటారా?

  • భారత్‌లో నాకు అడుగడుగునా అన్యాయమే: విజయ్‌ మాల్యా

లండన్‌, సెప్టెంబరు 10: భారత్‌లో తనపై జరుగుతున్న న్యాయపరమైన చర్యలు, బ్యాంకు రుణాల ఎగవేత వ్యవహారంపై వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘నేను ఎదుర్కొంటున్న, ఇంకా ఎదుర్కొంటూనే ఉన్న అన్యాయాలను చూస్తుంటే.. బొద్దింకగా మారిపోవాలేమో అనిపిస్తోంది. బహుశా బొద్దింకగా ఉంటేనే మెరుగైన జీవితం దొరుకుతుందేమో’’ అని ‘ఎక్స్‌’ వేదికగా వ్యాఖ్యానించారు. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ రుణాల వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) బొంబాయి హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో రూ.14,000 కోట్లకు పైగా రికవరీ చేసి, బ్యాంకులకు చెల్లించినట్లు పేర్కొందని మాల్యా గుర్తుచేశారు. ‘‘ఐదేళ్ల తర్వాత కూడా నన్ను బ్యాంకులను మోసం చేసిన వ్యక్తిగానే ఎందుకు చిత్రీకరిస్తున్నారు?’’ అని ప్రశ్నించారు. తాను ‘పారిపోయిన వ్యక్తి’నన్న వాదనను కూడా మాల్యా ఖండించారు. భారత ప్రభుత్వ చర్యలతో తనకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు.

Updated Date - Sep 11 , 2026 | 05:47 AM