Share News

జావా సముద్రంలో నౌక బోల్తా..

ABN , Publish Date - Sep 14 , 2026 | 06:18 AM

ఇండోనేషియాలోని జావా సముద్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 243 మంది ప్రయాణిస్తున్న ఓ ప్యాసింజర్‌ నౌక (ఫెర్రీ) ప్రతికూల వాతావరణం, అలల ఉధృతి కారణంగా బోల్తా పడి మునిగిపోయింది

జావా సముద్రంలో నౌక బోల్తా..
java

130 మంది గల్లంతు

జకార్తా, సెప్టెంబరు 13: ఇండోనేషియాలోని జావా సముద్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 243 మంది ప్రయాణిస్తున్న ఓ ప్యాసింజర్‌ నౌక (ఫెర్రీ) ప్రతికూల వాతావరణం, అలల ఉధృతి కారణంగా బోల్తా పడి మునిగిపోయింది. ఈ ఘటనలో కనీసం 130 మంది గల్లంతయ్యారు. గాలింపు చర్యలు చేపట్టిన సహాయక బృందాలు 107 మందిని రక్షించగా.. ఆరుగురి మృతదేహాలను వెలికి తీశాయి. ‘విర్గో ట్రాన్స్‌పోర్ట్‌ 8’ అనే నౌక తూర్పు జావా నుంచి దక్షిణ కాళిమంతన్‌కు వెళ్తుండగా ఆదివారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. నౌకలో ఉన్నవారిలో 213 మంది ప్రయాణికులు కాగా, 30 మంది సిబ్బంది. ప్రమాదానికి ముందు సముద్రంలో భారీ అలలు ఎగిసిపడుతున్నాయని, నౌక ఒకపక్కకు ఒరిగిపోతోందని కెప్టెన్‌ నుంచి అత్యవసర సందేశం వచ్చింది.

Updated Date - Sep 14 , 2026 | 06:19 AM