Share News

International Politics: వ్యూహాత్మకంగానే మదురో భార్య నిర్బంధం

ABN , Publish Date - Jan 05 , 2026 | 02:31 AM

వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్‌ మదురోతో పాటు ఆయన భార్య సిలియా ఫ్లోరె్‌సను కూడా అమెరికా నిర్బంధంలోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

International Politics: వ్యూహాత్మకంగానే మదురో భార్య నిర్బంధం

వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్‌ మదురోతో పాటు ఆయన భార్య సిలియా ఫ్లోరె్‌సను కూడా అమెరికా నిర్బంధంలోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే మదురో సర్కారులో కీలకంగా వ్యవహరిస్తున్న సిలియాను వ్యూహాత్మకంగానే అదుపులోకి తీసుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు. భర్త మదురోకు మద్దతు కూడగట్టకుండా.. అటు ప్రజల్లో, ఇటు సైన్యంలోనూ చైతన్యం తెచ్చి నాయకురాలిగా ఎదగకుండా అడ్డుకునే ఉద్దేశంతోనే బందీగా తీసుకెళ్లినట్లు వివరిస్తున్నారు. సిలియా సుదీర్ఘకాలం పాటు వెనెజువెలా ‘ఫస్ట్‌ లేడీ’కి మించిన స్థానంలో ఉన్నారు. మదురో అనుచరులు ఆమెను ‘తొలి యోధురాలి’గానూ పిలుస్తుంటారు. 1956లో టినాక్వి పట్టణంలో ఓ పూరి గుడిసెలో పుట్టిన సిలియా.. 32 ఏళ్ల వయసులో న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. మదురో రాజకీయ ప్రస్థానానికి సమాంతరంగా తన రాజకీయ జీవితాన్ని నిర్మించుకున్నారు. కొన్ని సందర్భాల్లో ఆమె మదురో కన్నా ఉన్నత పదవులను కూడా నిర్వహించారు. 2013లో మదురో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక.. దేశ రాజకీయ దిశను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించారు. మాజీ అఽధ్యక్షుడు హ్యూగో చావెజ్‌ నీడలోనే మదురో, సిలియాలిద్దరూ రాజకీయంగా ఎదిగారు. ప్రస్తుతం ఎంపీగానూ సిలియా కొనసాగుతున్నారు.

Updated Date - Jan 05 , 2026 | 02:31 AM