Share News

వైట్‌హౌస్‌ వద్ద కలకలం!

ABN , Publish Date - Mar 13 , 2026 | 03:45 AM

అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తల వేళ.. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ వద్ద తీవ్ర కలకలం రేగింది. బుధవారం ఉదయం వైట్‌హౌస్‌ సమీపంలో ఒక వాహనం భద్రతా బారికేడ్లను ఢీకొట్టింది.

వైట్‌హౌస్‌ వద్ద కలకలం!

  • భద్రతా బ్యారికేడ్లను ఢీకొట్టిన వాహనం

వాషింగ్టన్‌, మార్చి 12: అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తల వేళ.. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ వద్ద తీవ్ర కలకలం రేగింది. బుధవారం ఉదయం వైట్‌హౌస్‌ సమీపంలో ఒక వాహనం భద్రతా బారికేడ్లను ఢీకొట్టింది. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వైట్‌హౌస్‌ ప్రాంతంలో పూర్తిసాయి లాక్‌డౌన్‌ విధించారు. సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు వెంటనే వాహన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, ప్రాథమిక విచారణ జరుగుతోందని అధికారులు వెల్లడించారు. వైట్‌హౌ్‌సకు సమీపంలోని కనెక్టికట్‌ ఎవెన్యూ, హెచ్‌ సెయింట్‌ కూడలి వద్ద ఈ ఘటన జరిగినట్టు డైలీ మెయిల్‌ పేర్కొంది.

Updated Date - Mar 13 , 2026 | 03:45 AM