Share News

ఇరాన్‌ అంశంలో అమెరికా స్పెయిన్‌ మాటల యుద్ధం

ABN , Publish Date - Mar 06 , 2026 | 03:56 AM

ఇరాన్‌పై యుద్ధానికి సహకారం అందించే అంశంలో అమెరికా, స్పెయిన్‌ దేశాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇరాన్‌పై యుద్ధానికి సంబంధించి...

ఇరాన్‌ అంశంలో అమెరికా స్పెయిన్‌ మాటల యుద్ధం

  • సహకరించుకుంటే వాణిజ్య బంద్‌ అంటూ ట్రంప్‌ హెచ్చరిక

  • యుద్ధానికి వ్యతిరేకమేనన్న స్పెయిన్‌

న్యూఢిల్లీ, మార్చి 5: ఇరాన్‌పై యుద్ధానికి సహకారం అందించే అంశంలో అమెరికా, స్పెయిన్‌ దేశాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇరాన్‌పై యుద్ధానికి సంబంధించి దక్షిణ స్పెయిన్‌లో ఉన్న సైనిక స్థావరాలను వినియోగించుకుంటామని అమెరికా ప్రతిపాదించింది. తాము యుద్ధానికి వ్యతిరేకమని స్పష్టం చేసిన స్పెయిన్‌ ప్రధాని పెడ్రో సాన్‌చెజ్‌ అమెరికా ప్రతిపాదనను తిరస్కరించారు. ఇందుకు స్పందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. తమ ప్రతిపాదనకు అంగీకరించకుంటే వాణిజ్యాన్ని పూర్తిగా నిలిపివేస్తామని స్పెయిన్‌ను మంగళవారం హెచ్చరించారు. అనంతరం, తమ అధ్యక్షుడి హెచ్చరికలకు తలొగ్గిన స్పెయిన్‌.. యుద్ధం అంశంలో సహకరించేందుకు మందుకొచ్చిందని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలైన్‌ లేవిట్‌ బుధవారం ప్రకటించారు. ఆ తర్వాత కాసేపటికే స్పందించిన స్పెయిన్‌... వైట్‌హౌస్‌ ప్రకటనను ఖండించింది. యుద్ధానికి తాము వ్యతిరేకమని స్పష్టం చేసింది.

Updated Date - Mar 06 , 2026 | 03:56 AM