Share News

మళ్లీ రంగంలోకి యూఎస్ఎస్ గెరాల్డ్‌ ఫోర్డ్‌

ABN , Publish Date - Apr 04 , 2026 | 04:22 AM

ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక యుద్ధ నౌక యూఎస్ఎస్ గెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌ మళ్లీ పశ్చిమాసియా కదనరంగంలోకి వస్తోంది. యుద్ధం కోసం ఎర్ర సముద్రంలో మోహరించిన ఈ నౌకలో మంటలు చెలరేగడంతో..

మళ్లీ రంగంలోకి యూఎస్ఎస్ గెరాల్డ్‌ ఫోర్డ్‌

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 3: ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక యుద్ధ నౌక యూఎస్ఎస్ గెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌ మళ్లీ పశ్చిమాసియా కదనరంగంలోకి వస్తోంది. యుద్ధం కోసం ఎర్ర సముద్రంలో మోహరించిన ఈ నౌకలో మంటలు చెలరేగడంతో.. క్రొయేషియాకు తరలించి మరమ్మతులు చేపట్టారు. శుక్రవారం అక్కడి నుంచి గెరాల్డ్‌ ఫోర్డ్‌ నౌక బయలుదేరినట్టు అమెరికా రక్షణ వర్గాలు తెలిపాయి. యెమెన్‌లోని హౌతీలు ఇరాన్‌కు మద్దతుగా రంగంలోకి దిగి ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులు చేస్తున్న నేపథ్యంలో.. గెరాల్డ్‌ ఫోర్డ్‌ నౌకను తిరిగి పశ్చిమాసియాకు తరలిస్తున్నట్టు భావిస్తున్నారు. ఇప్పటికే యూఎ్‌సఎస్‌ అబ్రహం లింకన్‌ నౌక అరేబియా సముద్రంలో ఉంది. యూఎ్‌సఎస్‌ జార్జ్‌ బుష్‌ విమాన వాహక నౌక పశ్చిమాసియా వైపు వస్తోంది.

Updated Date - Apr 04 , 2026 | 04:22 AM