అమెరికా దాడిలో మరణించిన 3,375 మంది గుర్తింపు
ABN , Publish Date - Apr 13 , 2026 | 05:16 AM
అమెరికా-ఇజ్రాయెల్‌లు జరిపిన వైమానిక దాడిలో మరణించిన 3,375 మందిని గుర్తించినట్టు ఇరాన్ లీగల్ మెడిసిన్ ఆర్గనైజేషన్ ప్రకటించింది.
ఇస్తాంబుల్, ఏప్రిల్ 12: అమెరికా-ఇజ్రాయెల్‌లు జరిపిన వైమానిక దాడిలో మరణించిన 3,375 మందిని గుర్తించినట్టు ఇరాన్ లీగల్ మెడిసిన్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. వీరిలో 2,875 మంది పురుషులు, 496 మంది మహిళలు ఉన్నట్టు తెలిపింది. మిగిలిన నలుగురి వివరాలను వెల్లడించలేదు. మృతుల్లో అత్యధికులు ఇరాన్ దేశీయులే. చైనా, ఇరాక్, లెబనాన్, అఫ్ఘాన్, పాక్, సిరియా దేశాలకు చెందిన వారు కూడా మరణించారని తెలిపినా, వారి సంఖ్యను మాత్రం ప్రకటించలేదు. శాస్త్రీయ విధానాల ద్వారా మృతులను గుర్తించినట్టు పేర్కొంది.