తనపై యుద్ధానికి తానే నిధులిస్తున్న ఈయూ
ABN , Publish Date - Jan 28 , 2026 | 03:18 AM
భారత్- యూరోపియన్ యూనియన్(ఈయూ) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై అమెరికా స్పందించింది. భారత్‌తో వాణిజ్య ఒప్పందం చేసుకున్న ఈయూ..
భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందంపై అమెరికా
వాషింగ్టన్, జనవరి 27: భారత్- యూరోపియన్ యూనియన్(ఈయూ) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై అమెరికా స్పందించింది. భారత్‌తో వాణిజ్య ఒప్పందం చేసుకున్న ఈయూ.. ఐరోపా దేశాలపై రష్యా చేస్తున్న యుద్ధానికి తానే స్వయంగా నిధు లు సమకూరుస్తున్నట్టు అయిందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ హెచ్చరించారు. ‘‘రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందని భారత్‌పై 25ు సుంకాలు విధించాం ఇప్పుడేం జరిగిందో చూడండి. భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై ఈయూ సంతకం చేసింది. రష్యా నుంచి భారత్‌కు తొలుత చమరు వెళుతోంది. అక్కడి రిఫైనరీల్లో శుద్ధి చేసిన తర్వాత వచ్చే చమురు ఉత్పత్తులను ఐరోపా వాసులు కొనుగోలు చేస్తారు. తమపై యుద్ధానికే వాళ్లే నిధులు ఇస్తున్నారు’’ అని స్కాట్ బెసెంట్ పేర్కొన్నారు. అయితే, రష్యా-ఉక్రెయిన్ సమస్య విషయంలో ఐరోపా దేశాలతో పోలిస్తే అమెరికానే ఎన్నో త్యాగాలు చేసిందని బెసెంట్ వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వంలోనే రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి తెరపడుతుందని స్పష్టం చేశారు.