Share News

అమెరికాకు యుద్ధ నష్టం..రూ.18.87 లక్షల కోట్లు

ABN , Publish Date - Mar 05 , 2026 | 05:31 AM

ఇరాన్‌పై చేపట్టిన యుద్ధంతో అమెరికాకు సుమారు రూ.18.87 లక్షల కోట్ల (210 బిలియన్‌ డాలర్ల) మేర నష్టం జరగవచ్చని పెన్సిల్వేనియా ...

అమెరికాకు యుద్ధ నష్టం..రూ.18.87 లక్షల కోట్లు

  • దాడుల కోసం రోజుకు రూ.6-7 వేల కోట్లు

  • దేశ ఆర్థిక వ్యవస్థపై పడే భారం మరెంతో!

న్యూయార్క్‌: ఇరాన్‌పై చేపట్టిన యుద్ధంతో అమెరికాకు సుమారు రూ.18.87 లక్షల కోట్ల (210 బిలియన్‌ డాలర్ల) మేర నష్టం జరగవచ్చని పెన్సిల్వేనియా యూనివర్సిటీ పెన్‌వార్టన్‌ బడ్జెట్‌ మోడల్‌ డైరెక్టర్‌ కెంట్‌ స్మెట్టర్స్‌ అంచనా వేశారు. యుద్ధం మొదలుపెట్టిన తొలిరోజున అమెరికా చేసిన ఖర్చు రూ.6,900 కోట్లు (779 మిలియన్‌ డాలర్లు) అని పేర్కొన్నారు. నెలరోజుల పాటు యుద్ధం కొనసాగే అవకాశం ఉందని అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించిన నేపథ్యంలో ప్రతిరోజూ ఇదే స్థాయిలో ఖర్చు ఉండవచ్చని తెలిపారు. ఈ లెక్కన నెలరోజుల యుద్ధం ఖర్చులు రూ.2 లక్షల కోట్లకుపైగా ఉంటాయని అంచనా వేశారు. అయితే యుద్ధం కారణంగా ధరలు పెరగడం, కంపెనీలకు నష్టాలు, బీమా చెల్లింపులు, షేర్‌మార్కెట్‌ కుంగిపోవడం, ఇతర రూపాల్లో దేశ ఆర్థిక వ్యవస్థపై పడే భారం అన్నీ కలిపితే.. ఆ నెల రోజుల్లో అమెరికాకు జరిగే నష్టం రూ.18.87 లక్షల కోట్ల మేర ఉంటుందని పేర్కొన్నారు.

Updated Date - Mar 05 , 2026 | 05:32 AM