ఇరాన్‌పై దాడులకు ‘ఉక్రెయిన్’ ఆయుధాలు!
ABN , Publish Date - Mar 08 , 2026 | 04:12 AM
ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో ఆ దేశం ప్రయోగిస్తున్న చౌక డ్రోన్లను ధ్వంసం చేయడం లేదా కూల్చి వేసేందుకు అమెరికా ప్రస్తుతం ఖరీదైన క్షిపణులను ప్రయోగిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా...
వాషింగ్టన్, మార్చి 7: ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో ఆ దేశం ప్రయోగిస్తున్న చౌక డ్రోన్లను ధ్వంసం చేయడం లేదా కూల్చి వేసేందుకు అమెరికా ప్రస్తుతం ఖరీదైన క్షిపణులను ప్రయోగిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉక్రెయిన్‌లో పరీక్షలు నిర్వహించి.. సమర్థవంతమైనవిగా నిర్ధారించిన ఇంటర్‌సెప్టర్లను ఇరాన్ చౌక డ్రోన్లపై ప్రయోగించాలని నిర్ణయించినట్టు అమెరికా అధికారులు తెలిపారు. ‘మెరా్‌ప్స’గా పేర్కొనే ఇంటర్‌సెప్టర్లు.. కూడా డ్రోన్లేనని పేర్కొన్నారు. ఇవి ఇతర డ్రోన్లపై సమర్థవంతంగా దాడి చేయగలవన్నారు. ఓ మధ్యతరహా ట్రక్కు వెనుక భాగంలో వీటిని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. వాటికి సమీపంలోకి వస్తున్న డ్రోన్లను గుర్తించగలవని, వాటిని కూల్చేయగలవని పేర్కొన్నారు. అలాగే.. ఉపగ్రహ సిగ్నళ్లు, ఎలకా్ట్రనిక్ కమ్యూనికేషన్లు జామ్ అయినప్పుడు ఇవి కృత్రిమమేధ సాయంతో పనిచేయగలవని తెలిపారు. అదేవిధంగా మధ్యప్రాచ్యంలో సరికొత్త యాంటీ డ్రోన్ క్షిపణి వ్యవస్థను కూడా ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఈ విషయంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందిస్తూ.. అమెరికా తమ సహకారం కోరిందన్నారు. ఇరాన్ షహీద్ డ్రోన్లను ఎదుర్కొనేందుకు సాయం చేయాలని కోరినట్టు ఆయన తెలిపారు. కాగా.. ప్రస్తుతం 50 వేల డాలర్ల ఖరీదైన డ్రోన్‌ను కూల్చివేసేందుకు.. అమెరికా ఏకంగా 5 లక్షల డాలర్ల ఖరీదైన క్షిపణిని ప్రయోగిస్తోంది. కాగా, బనాన్ బెకా వ్యాలీలోని నబీ చిత్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 41 మంది మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు లెబనాన్ సైనికులున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంలో ఉన్న కిర్యాత్ ష్మోనా, నహారియా పట్టణాలను వెంటనే ఖాళీ చేయాలని హెజ్బొల్లా ఇజ్రాయెల్‌ను హెచ్చరించింది