హెచ్1బీ వేతనాల్లో కొత్త రూల్స్
ABN , Publish Date - Mar 28 , 2026 | 05:48 AM
తమ దేశంలోని కంపెనీల్లో విదేశీ ఉద్యోగులను తగ్గించి స్వదేశీ ఉద్యోగులకు ఎక్కువ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో వీసా వేతనాల్లో భారీ సంస్కరణలకు అమెరికా ప్రభుత్వం సిద్ధమైంది.
విదేశీ ఉద్యోగులకు వార్షిక వేతనం 14 వేల డాలర్ల మేర పెంపు
న్యూఢిల్లీ, మార్చి 27: తమ దేశంలోని కంపెనీల్లో విదేశీ ఉద్యోగులను తగ్గించి స్వదేశీ ఉద్యోగులకు ఎక్కువ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో వీసా వేతనాల్లో భారీ సంస్కరణలకు అమెరికా ప్రభుత్వం సిద్ధమైంది. హెచ్1 బీ వీసాదారుల వార్షిక వేతనాన్ని సుమారు 14 వేల డాలర్ల మేరకు పెంచాలంటూ కీలక ప్రతిపాదన చేసింది. అమెరికా ఉద్యోగులతో పోలిస్తే కంపెనీలకు విదేశీ ఉద్యోగులు తక్కువ వేతనాలకు లభిస్తున్నారని, దీనివల్ల స్వదేశీ ఉద్యోగులకు అవకాశాలు పోతున్నాయంటూ చాలా కాలంగా ఆందోళనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విదేశీయులకు వేతనాలు పెంచడం ద్వారా కంపెనీలు తమ దేశీయులకు అవకాశాలు కల్పిస్తాయనే ఆలోచనతో అమెరికా లేబర్ డిపార్ట్‌మెంట్ ఈ ప్రతిపాదన చేసింది. ప్రస్తుతం హెచ్1బీ వీసాదారులు తమతో సమానమైన ఉద్యోగాల్లో ఉన్న అమెరికన్ల కంటే సగటున 10,191 డాలర్ల మేరకు తక్కువగా వార్షిక వేతనం అందుకుంటున్నారు.