Share News

ట్రంప్‌ ఇక సూపర్‌ ప్రెసిడెంట్‌

ABN , Publish Date - Jun 30 , 2026 | 04:19 AM

తిరుగులేని అధికారాలు ఉండే అమెరికా అధ్యక్షుడికి ఆ దేశ సుప్రీంకోర్టు మరిన్ని అధికారాలు కట్టబెడుతూ సోమవారం కీలక తీర్పు ఇచ్చింది.

ట్రంప్‌ ఇక సూపర్‌ ప్రెసిడెంట్‌

  • అధ్యక్షుడికి అసాధారణ అధికారాలు కట్టబెట్టిన సుప్రీంకోర్టు

వాషింగ్టన్‌, జూన్‌ 29: తిరుగులేని అధికారాలు ఉండే అమెరికా అధ్యక్షుడికి ఆ దేశ సుప్రీంకోర్టు మరిన్ని అధికారాలు కట్టబెడుతూ సోమవారం కీలక తీర్పు ఇచ్చింది. దేశంలో ఎంతో కీలకమైన నేషనల్‌ లేబర్‌ రిలేషన్స్‌ బోర్డు, మెరిట్‌ సిస్టమ్స్‌ ప్రొటెక్షన్‌ బోర్డు, కన్జూమర్‌ ప్రొడక్ట్‌ సేఫ్టీ కమిషన్‌, ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌ అధ్యక్షులు, బోర్డు సభ్యులను ఎలాంటి కారణం చూపకుండా పదవుల నుంచి తొలగించే అధికారం అధ్యక్షుడికి ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జాన్‌ రాబర్ట్స్‌ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు చెప్పింది. పై బోర్డుల సభ్యులందరినీ ఎలాంటి కారణం చూపకుండానే ట్రంప్‌ ఇప్పటికే పదవుల నుంచి తొలగించారు. ట్రంప్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌ సభ్యురాలు రెబెక్కా స్లాటర్‌ కోర్టుకు వెళ్లారు. ఈ కేసును విచారించిన ధర్మాసనం సోమవారం తీర్పు చెప్పింది.

Updated Date - Jun 30 , 2026 | 04:19 AM