Share News

India US trade deal: బఠానీలు సహా పప్పులపై భారత్‌ అధిక సుంకాలు

ABN , Publish Date - Jan 18 , 2026 | 04:02 AM

భారత్‌లో భవిష్యత్తులో వాణిజ్య ఒప్పందం జరిగితే పప్పు ధాన్యాలపై సుంకాలు తగ్గించేందుకు కృషి చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌కు సెనెటర్లు స్టీవ్‌ డైనీస్‌.....

India US trade deal: బఠానీలు సహా పప్పులపై భారత్‌ అధిక సుంకాలు

  • సుంకాల తగ్గింపునకు చర్యలు తీసుకోండి

  • అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఇద్దరు సెనెటర్ల లేఖ

న్యూయార్క్‌/వాషింగ్టన్‌, జనవరి 17: భారత్‌లో భవిష్యత్తులో వాణిజ్య ఒప్పందం జరిగితే పప్పు ధాన్యాలపై సుంకాలు తగ్గించేందుకు కృషి చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌కు సెనెటర్లు స్టీవ్‌ డైనీస్‌ (మొంతానా), కెవిన్‌ క్రామర్‌ (నార్త్‌ డకోటా) విజ్ఞప్తి చేశారు. భారత్‌ విధించే అనుచిత సుంకాలతో అమెరికాలోని మొంతానా, నార్త్‌ డకోటా రాష్ట్రాల రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. బఠానీలు సహా ప్రపంచ దేశాల్లో భారత్‌ సుమారు 27ు పప్పు ధాన్యాలను వినియోగిస్తుందని ట్రంప్‌కు రాసిన లేఖలో తెలిపారు. శనగలు, కందిపప్పు, ఎండబెట్టిన చిక్కుళ్లు భారతీయులు ఎక్కువగా వాడుతున్నారు. పచ్చి బఠానీల దిగుమతిపై గతేడాది అక్టోబరు 30న భారత్‌ 30ు సుంకాలు విధించిందని, గతేడాది నవంబరు 1 నుంచి అమల్లోకి వచ్చాయని స్టీవ్‌ డైనీస్‌, కెవిన్‌ క్రామర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల నాణ్యమైన పప్పులను అమెరికా రైతులు అధిక ధరలకు భారత్‌కు ఎగుమతి చేయాల్సి వస్తోందన్నారు. భారత్‌ ప్రధానితో జరిగే చర్చల్లో పప్పుల దిగుమతి సుంకాల విషయమై రెండు దేశాలకు పరస్పర ఆర్థిక సహకారం పెంపుదలతోపాటు పరస్పర ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని ట్రంప్‌ను కోరారు.

Updated Date - Jan 18 , 2026 | 04:02 AM