Share News

అమెరికా వీసాల కోసం భారతీయులు ‘వీసా ఆలయా’నికి వెళ్తారు!

ABN , Publish Date - May 15 , 2026 | 03:58 AM

అమెరికాలోని మిసోరికి చెందిన జూనియర్‌ సెనెటర్‌ ఎరిక్‌ స్మిత్‌ భారతీయులపై ఆక్రోశం వెళ్లగక్కారు ‘మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌ (మాగా)’ మద్దతుదారుడైన ఈ రిపబ్లికన్‌ పార్టీ...

అమెరికా వీసాల కోసం భారతీయులు ‘వీసా ఆలయా’నికి వెళ్తారు!

  • హెచ్‌-1బీ వీసాలపై నిషేధం విధించాలి

  • అమెరికా సెనెటర్‌ ఎరిక్‌ స్మిత్‌ విద్వేషపూరిత వ్యాఖ్యలు

  • చిలుకూరు బాలాజీ ఆలయాన్ని ప్రస్తావించిన వైనం

వాషింగ్టన్‌, మే 14: అమెరికాలోని మిసోరికి చెందిన జూనియర్‌ సెనెటర్‌ ఎరిక్‌ స్మిత్‌ భారతీయులపై ఆక్రోశం వెళ్లగక్కారు ‘మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌ (మాగా)’ మద్దతుదారుడైన ఈ రిపబ్లికన్‌ పార్టీ నేత హెచ్‌-1బీ వీసా కార్యక్రమంపై నిషేధం విధించాలని డిమాండ్‌ చేశారు. ఈ వీసాలతో అమెరికన్లకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. భారతీయులు ‘వీసా కార్టెల్‌’గా ఏర్పడ్డారని.. అమెరికా వీసా కోసం ‘వీసా దేవాలయా’నికి వెళ్తారని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. హైదరాబాద్‌లోని ఆ ఆలయంలోని దేవుడు అమెరికా వీసాలు ఇప్పిస్తాడన్న నమ్మకంతో అక్కడి వెళ్తారని పేర్కొన్నారు. అమెరికా వీసాల కోసం ప్రయత్నం చేసేవారు హైదరాబాద్‌ సమీపంలోని చిలుకూరు బాలాజీ ఆలయానికి వెళ్లి మొక్కుకుంటారు. ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ‘‘హైదరాబాద్‌లో వీసా కార్టెల్‌కు దాని సొంత ‘వీసా దేవాలయం’ ఉంది. అక్కడ వేలాది మంది భారతీయులు ప్రదక్షిణలు చేస్తూ.. అమెరికా వర్క్‌ వీసాల కోసం పాస్‌పోర్ట్‌లు పెట్టి, ఆశీర్వాదం పొందుతారు. అమెరికన్‌ కార్మికులు ఇంత మోసపూరితమైన వ్యవస్థతో పోటీ పడాల్సిన అవసరం లేదు’’ అని స్మిత్‌ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. కాగా, స్మిత్‌ తీరుపై నెటిజెన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనవి జాత్యహంకార వ్యాఖ్యలని మండిపడ్డారు.

Updated Date - May 15 , 2026 | 03:58 AM