Share News

అమెరికాలో ‘దీపావళి’ స్టాంపు విడుదల

ABN , Publish Date - Oct 23 , 2026 | 03:47 AM

దీపావళి పండుగను పురస్కరించుకుని అమెరికా పోస్టల్‌ సర్వీస్‌ (యూఎస్‌పీఎస్‌) ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేసింది.

అమెరికాలో ‘దీపావళి’ స్టాంపు విడుదల

వాషింగ్టన్‌, అక్టోబరు 22: దీపావళి పండుగను పురస్కరించుకుని అమెరికా పోస్టల్‌ సర్వీస్‌ (యూఎస్‌పీఎస్‌) ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేసింది. భారత సంతతికి చెందిన హ్యూస్టన్‌ కళాకారిణి సంగీత భుటాడా రూపొందించిన రంగవల్లి నమూనాతో ఈ స్టాంపును తీర్చిదిద్దారు. వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో భారత రాయబారి వినయ్‌ మోహన్‌ క్వాత్రా, యూఎస్‌పీఎస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శిబానీ, సంగీత ఈ స్టాంపును ఆవిష్కరించారు.

Updated Date - Oct 23 , 2026 | 03:50 AM