Share News

అమెరికాలో 40 శాతం పెరిగిన పెట్రోల్‌ ధర

ABN , Publish Date - Mar 24 , 2026 | 04:39 AM

ఇరాన్‌తో యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి అమెరికాలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్‌ ధర భారీగా పెరిగింది. కొన్ని రాష్ట్రాల్లో ...

అమెరికాలో 40 శాతం పెరిగిన పెట్రోల్‌ ధర

న్యూఢిల్లీ, మార్చి 23: ఇరాన్‌తో యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి అమెరికాలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్‌ ధర భారీగా పెరిగింది. కొన్ని రాష్ట్రాల్లో ఈ పెరుగుదల దాదాపు 40 శాతం వరకు ఉందని గ్యాస్‌బడ్డీ డేటాపై విశ్లేషణలో న్యూయార్క్‌ టైమ్స్‌ నివేదించింది. యుద్ధం వలన సంభవించే ఆర్థిక పరిణామాలపై అమెరికా ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని సీబీఎస్‌ న్యూస్‌ సర్వేను ఉటంకిస్తూ వార్తా సంస్థ ఏఎన్‌ఐ పేర్కొంది. యుద్ధం ఇప్పటికే ఇంధన ధరలను ప్రభావితం చేస్తోందని, గృహ వ్యయంపై కూడా ఒత్తిడి పెంచుతుందని అమెరికన్లు అభిప్రాయపడుతున్నారని సర్వే పేర్కొంది. ఘర్షణ స్వల్ప కాలంలోనే అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సర్వేలో పాల్గొన్న వారిలో మెజార్టీ అభిప్రాయంగా ఉంది. ఆర్థిక పరిస్థితుల క్షీణతతో పాటు ఆర్థిక మాంద్యం మళ్లీ తలెత్తుతుందనే భయం అమెరికన్లలో ఉందని సర్వే గణాంకాలు సూచిస్తున్నాయి.

Updated Date - Mar 24 , 2026 | 04:39 AM