Share News

అమెరికా ఉద్యోగ వృద్ధిలో 88శాతం క్షీణత

ABN , Publish Date - Feb 19 , 2026 | 04:00 AM

అధ్యక్షుడు ట్రంప్‌ అనుసరిస్తున్న కఠిన వలస విధానాల ప్రభావం అమెరికా ఉద్యోగ వృద్ధి రేటుపై పడింది. అగ్రరాజ్యానికి తగ్గుముఖం ...

అమెరికా ఉద్యోగ వృద్ధిలో 88శాతం క్షీణత

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: అధ్యక్షుడు ట్రంప్‌ అనుసరిస్తున్న కఠిన వలస విధానాల ప్రభావం అమెరికా ఉద్యోగ వృద్ధి రేటుపై పడింది. అగ్రరాజ్యానికి తగ్గుముఖం పట్టిన అనధికార వలసలకు అనుగుణంగా కొత్త ఉద్యోగాల సృష్టిలోనూ భారీ క్షీణత నమోదైంది. ముఖ్యంగా నిర్మాణ, తయారీ రంగాలపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. శాన్‌ఫ్రాన్సిస్కో ఫెడరల్‌ రిజర్వు మంగళవారం ప్రచురించిన నివేదిక ప్రకారం.. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 2025లో మొత్తం ఉద్యోగాల భర్తీ దాదాపు 88 శాతం తగ్గింది. 2024లో అమెరికాలో దాదాపు 14,60,000 ఉద్యోగాలు అందుబాటులోకి రాగా, 2025లో ఉద్యోగ వృద్ధి దాదాపు 88 శాతం తగ్గి కేవలం 1,81,000కు పడిపోయుయింది. వలసలు తగ్గడమే ఈ మందగమనానికి కారణమని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.

Updated Date - Feb 19 , 2026 | 04:00 AM