Stern warning to H-1B and H-4 visa applicants: ఇమిగ్రేషన్ చట్టాన్ని ఉల్లంఘిస్తే శిక్ష తప్పదు
ABN , Publish Date - Jan 04 , 2026 | 04:25 AM
భారత్‌లోని అమెరికా ఎంబసీ హెచ్-1బీ, హెచ్-4 వీసా దరఖాస్తుదారులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ట్రంప్ సర్కారు విధించిన ఆంక్షల నేపథ్యంలో వీసా ప్రాసెసింగ్.....
హెచ్-1బీ దరఖాస్తుదారులకు అమెరికా హెచ్చరిక
న్యూఢిల్లీ, జనవరి 3: భారత్‌లోని అమెరికా ఎంబసీ హెచ్-1బీ, హెచ్-4 వీసా దరఖాస్తుదారులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ట్రంప్ సర్కారు విధించిన ఆంక్షల నేపథ్యంలో వీసా ప్రాసెసింగ్, రెన్యువల్స్ ఆలస్యం కావడంతో పెరుగుతున్న ఉద్రిక్తతలపై ఎంబసీ స్పందించింది. అమెరికా ఇమిగ్రేషన్ చట్టాలను ఉల్లంఘిస్తే తీవ్రమైన క్రిమినల్ శిక్షలు విధిస్తామని ‘ఎక్స్’లో చేసిన పోస్టులో పేర్కొంది. అమెరికాలోకి అక్రమ వలసలను అంతం చేయడంతో పాటు దేశ సరిహద్దులను, పౌరులను రక్షించడానికి ట్రంప్ యంత్రాంగం కట్టుబడి ఉందని స్పష్టం చేసింది.