Share News

Visa fee hike: హెచ్‌-1బీ వీసా ప్రీమియం ఫీజుల పెంపు

ABN , Publish Date - Jan 11 , 2026 | 02:57 AM

హెచ్‌-1బీ సహా పలు వీసాల ప్రీమియం ప్రాసెసింగ్‌ ఫీజులను అమెరికా పెంచింది. మార్చి 1 నుంచి పెరిగిన రుసుములు అమల్లోకి వస్తాయని అమెరికా పౌరతస్వ, వలస సేవల విభాగం ..

Visa fee hike: హెచ్‌-1బీ వీసా ప్రీమియం ఫీజుల పెంపు

న్యూఢిల్లీ, జనవరి 10: హెచ్‌-1బీ సహా పలు వీసాల ప్రీమియం ప్రాసెసింగ్‌ ఫీజులను అమెరికా పెంచింది. మార్చి 1 నుంచి పెరిగిన రుసుములు అమల్లోకి వస్తాయని అమెరికా పౌరతస్వ, వలస సేవల విభాగం (యూఎ్‌ససీఐఎస్‌) ప్రకటించింది. 2023 జూన్‌ నుంచి 2025 జూన్‌ వరకూ ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ ఫీజులను పెంచుతున్నట్లు పేర్కొంది. ఈ పెంపుతో అమెరికాలో చదువుతున్న, ఉద్యోగం చేస్తున్న భారతీయులపై ప్రత్యక్షంగా ప్రభావం పడనుంది. సవరించిన ఫీజుల ప్రకారం... హెచ్‌-2బీ, ఆర్‌-1 నాన్‌-ఇమిగ్రెంట్‌ హోదా కోసం దాఖలు చేసే ఐ-129 దరఖాస్తుల ప్రీమియం ప్రాసెసింగ్‌ ఫీజు 1,685 డాలర్ల నుంచి రూ.1,780 డాలర్లకు పెరగనుంది. హెచ్‌-1బీ, ఎన్‌-1, ఓ-1, పీ-1, టీఎన్‌ వీసాలకు సంబంధించి ఐ-129 ఫాం ఫీజులు 2,805 డాలర్ల నుంచి 2,965 డాలర్లకు పెరుగుతాయి. విదేశీ కార్మికుల కోసం దాఖలు చేసే ఐ-140 ఫాంకు కూడా ఈ మొత్తమే వర్తించనుంది. ఎఫ్‌-1, ఎఫ్‌-2, జే-1, జే-2, ఎం-1, ఎం-2 వీసాలకు ఇచ్చే ఐ-539 ఫాం రుసుమును 1,965 డాలర్ల నుంచి 2,075 డాలర్లకు పెంచారు. త్వరితగతిన ఉపాధి అనుమతి కోరే వారితో పాటు, ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఓపీటీ), స్టెమ్‌-ఓపీటీ దరఖాస్తుదారులకు ఇచ్చే ఐ-765 ఫాంల ప్రీమియం ప్రాసెసింగ్‌ ఫీజును 1,685 డాలర్ల నుంచి 1,780 డాలర్లకు పెంచారు. ఇదిలా ఉండగా, అమెరికాలో వలస కార్మికుల వర్క్‌ పర్మిట్ల ఆటోమేటిక్‌ పునరుద్ధరణను రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్‌ఎ్‌స)పై దావా వేశారు. ప్రభుత్వ చర్య వేలాది కుటుంబాల ఉద్యోగ, ఆర్థిక స్థిరత్వాన్ని సవాలు చేయడమేనని కాలిఫోర్నియాలోని ఫెడరల్‌ కోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంలో వారు ఆరోపించారు. ఎవరినీ సంప్రదించకుండా తీసుకున్న ఈ నిర్ణయం ఏకపక్షం, మోసపూరితమని పేర్కొన్నారు.

Updated Date - Jan 11 , 2026 | 02:57 AM