Share News

అమెరికాలో గాడిన పడని విమానయాన సేవలు

ABN , Publish Date - Nov 17 , 2026 | 03:31 AM

అమెరికాలో విమానయాన సేవల్లో అంతరాయాలు కొనసాగుతూనే ఉన్నాయి. టెలికం వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపంతో గత శుక్రవారం ఐదు గంటల పాటు దేశవ్యాప్తంగా..

అమెరికాలో గాడిన పడని విమానయాన సేవలు

  • మూడు రోజుల్లో 17,700 విమానాల రద్దు.. 24 వేలకుపైగా ఆలస్యం

వాషింగ్టన్‌, నవంబర్‌ 16: అమెరికాలో విమానయాన సేవల్లో అంతరాయాలు కొనసాగుతూనే ఉన్నాయి. టెలికం వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపంతో గత శుక్రవారం ఐదు గంటల పాటు దేశవ్యాప్తంగా బయల్దేరాల్సిన అన్ని విమానాలు నిలిచిపోగా... ఆ తర్వాత సేవలను పునరుద్ధరించినప్పటికీ సాధారణ పరిస్థితి ఇంకా ఏర్పడలేదు. సిబ్బంది సర్దుబాటు, విమాన సర్వీసుల షెడ్యూళ్లు దెబ్బతినడంతో శని, ఆదివారాల్లోనూ అంతరాయాలు కొనసాగాయి. గత శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల్లో సుమారు మొత్తం 17,700 విమాన సర్వీసులు రద్దయ్యాయి. మరో 24వేలకుపైగా సర్వీసులు ఆలస్యమయ్యాయి. మరొక్క రోజులో సాధారణ స్థితి నెలకొంటుందని అంచనా వేస్తున్నట్టు రవాణా మంత్రి సియాన్‌ డఫీ తెలిపారు. ఫ్లైట్‌అవేర్‌ గణాంకాల ప్రకారం..ఆదివారం కూడా 2,100-,2300 విమానాలు రద్దయ్యాయి. 9,400కు పైగా సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. దీంతో విమానాశ్రయాల్లో ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది.

Updated Date - Nov 17 , 2026 | 03:33 AM