Share News

18.87 లక్షల కోట్లు

ABN , Publish Date - Mar 04 , 2026 | 03:57 AM

ఇజ్రాయెల్‌ కోసం ఇరాన్‌పై మొదలుపెట్టిన ఈ యుద్ధం వల్ల అమెరికాపై పడే ఆర్థిక భారం దాదాపు రూ.18.87 లక్షల కోట్లని పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన....

18.87 లక్షల కోట్లు

  • ఇరాన్‌పై యుద్ధంతో అమెరికాపై పడే భారం..

న్యూయార్క్‌: ఇజ్రాయెల్‌ కోసం ఇరాన్‌పై మొదలుపెట్టిన ఈ యుద్ధం వల్ల అమెరికాపై పడే ఆర్థిక భారం దాదాపు రూ.18.87 లక్షల కోట్లని పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన పెన్‌వార్టన్‌ బడ్జెట్‌ మోడల్‌ డైరెక్టర్‌ కెంట్‌ స్మెట్టర్స్‌ అంచనా వేశారు. ఈ యుద్ధం మొదలుపెట్టిన 24గంటల్లో అమెరికా చేసిన ఖర్చు అక్షరాలా 779 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.6,900 కోట్లు). కనీసం నెలరోజులపాటు ఈ యుద్ధం కొనసాగే అవకాశం ఉందని ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. సెంటర్‌ ఫర్‌ న్యూ అమెరికన్‌ సెక్యూరిటీ గణాంకాల ప్రకారం.. ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక నౌక అయిన యూఎ్‌సఎస్‌ గెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌ వంటి క్యారియర్‌ స్ట్రైక్‌ గ్రూప్స్‌ నిర్వహణకు రోజుకు రూ.58 కోట్లు ఖర్చవుతుంది. ఇలాంటి నౌకలు రెండింటిని అమెరికా పశ్చిమాసియాలో మోహరించింది. వాటికి నెలకు అయ్యే నిర్వహణ ఖర్చే దాదాపు రూ.3,500 కోట్లు. ఇక, ఈ యుద్ధం మొదలుపెట్టడానికి ముందు సన్నాహకాల కోసమే అమెరికా చేసిన ఖర్చు ఏకంగా రూ.5,556 కోట్లు. ట్రంప్‌ చెప్పినట్టు నెలరోజులపాటు యుద్ధం కొనసాగితే.. దాదాపుగా 210 బిలియన్‌ డాలర్లు (ఇంచుమించు రూ.18.87 లక్షల కోట్లు) ఖర్చవుతుందని అంచనా.

Updated Date - Mar 04 , 2026 | 03:57 AM