రష్యా చమురు కొనుగోలుకు అమెరికా ఓకే
ABN , Publish Date - May 20 , 2026 | 02:37 AM
రష్యా నుంచి ముడి చమురు కొనుగోలుపై విధించిన ఆంక్షల సడలింపును మరో నెల పొడిగిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. మే 16 వరకు ఉన్న ఈ సడలింపును ...
వాషింగ్టన్, మే 19: రష్యా నుంచి ముడి చమురు కొనుగోలుపై విధించిన ఆంక్షల సడలింపును మరో నెల పొడిగిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. మే 16 వరకు ఉన్న ఈ సడలింపును వచ్చే జూన్ 17 వరకు పొడిగిస్తున్నట్లు అమెరికా ట్రెజరీ శాఖ సోమవారం ఆర్డర్‌ను జారీ చేసింది. ఇంధన సంక్షోభం ఎదుర్కొంటున్న దేశాలకు మద్దతుగా మరో 30 రోజులు ఆంక్షల సడలింపును పొడిగించినట్లు యూఎస్ ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో రష్యా నుంచి ముడి చమురు కొనుగోలుపై గతంలో ఇచ్చిన మినహాయింపులు శనివారంతో ముగిశాయి. ఈ నేపథ్యంలో అమెరికా తాజాగా ఆ మినహాయింపులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.