గ్రీన్‌కార్డ్ నిబంధనపై మెత్తబడ్డ అమెరికా
ABN , Publish Date - May 24 , 2026 | 04:02 AM
తాత్కాలిక వీసాలపై అమెరికా వచ్చేవారు గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే అమెరికా వీడి స్వదేశానికి వెళ్లాల్సిందేనంటూ తెచ్చిన నిబంధనపై విమర్శలు వెల్లువెత్తడంతో..
వాషింగ్టన్, మే 23: తాత్కాలిక వీసాలపై అమెరికా వచ్చేవారు గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే అమెరికా వీడి స్వదేశానికి వెళ్లాల్సిందేనంటూ తెచ్చిన నిబంధనపై విమర్శలు వెల్లువెత్తడంతో.. ట్రంప్ సర్కారు ఆ నిబంధన విషయంలో కాస్తంత మెత్తబడినట్టు కనిపిస్తోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూర్చేవారు, దేశ ప్రయోజనాలకు కీలకమైన రంగాల్లో ఉన్నవారికి, పరిశోధనలు చేసేవారికి ఈ నిబంధన నుంచి మినహాయింపు లభించే అవకాశం ఉందని యూఎస్ సిటిజెన్‌షి్‌ప అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) సంకేతాలిచ్చింది. దరఖాస్తుదారునికి అమెరికా లోపలే ఉండి హోదా మార్పు పొందే అర్హత ఉందా లేదా అనే విషయాన్ని ప్రతి దరఖాస్తునూ పరిశీలించి (కేస్ బై కేస్) నిర్ణయిస్తామని అధికారులు తెలిపారు.