Share News

అమెరికా ‘ఈ-3 అవాక్స్‌’ విమానం ధ్వంసం

ABN , Publish Date - Mar 30 , 2026 | 04:22 AM

యుద్ధంలో అమెరికాకు మరో దెబ్బ తగిలింది. సౌదీలోని ప్రిన్స్‌ సుల్తాన్‌ ఎయిర్‌బేస్‌ పై ఇరాన్‌ క్షిపణి దాడుల్లో అత్యంత కీలకమైన ...

అమెరికా ‘ఈ-3 అవాక్స్‌’ విమానం ధ్వంసం

టెల్‌అవీవ్‌, మార్చి 29: యుద్ధంలో అమెరికాకు మరో దెబ్బ తగిలింది. సౌదీలోని ప్రిన్స్‌ సుల్తాన్‌ ఎయిర్‌బేస్‌ పై ఇరాన్‌ క్షిపణి దాడుల్లో అత్యంత కీలకమైన ‘ఈ-3 సెంట్రీ‘ అవాక్స్‌(ఎర్లీ వార్నింగ్‌ అండ్‌ కంట్రోల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌) విమానం ధ్వంసమైంది. అమెరికా దీనిని అధికారికంగా ధ్రువీకరించకున్నా.. ఆ దేశ రక్షణ వర్గాలను ఉటంకిస్తూ వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌, రాయిటర్స్‌ వార్తా సంస్థలు దీనిపై కథనాలు ప్రచురించాయి. విమానం తీవ్రంగా ధ్వంసమైన చిత్రాలను రష్యన్‌ టైమ్స్‌, ఇతర వార్తా సంస్థలు సోషల్‌ మీడియాలో పోస్టు చేశాయి. బోయింగ్‌ సంస్థ అభివృద్ధి చేసిన ఈ-3 సెంట్రీ విమానం ఒక రకంగా చెప్పాంటే ఎగిరే రాడార్‌, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌గా చెప్పవచ్చు. విమానం పైన 30 అడుగుల వ్యాసమున్న రాడార్‌ డోమ్‌ ఉంటుంది. అది 10 సెకన్లకోసారి గుండ్రంగా తిరుగుతూ నిఘా పెడుతుంది. ఈ విమానాన్ని ఎక్కడ మోహరించినా.. చుట్టూ సుమారు 400 నుంచి 650 కిలోమీటర్ల దూరం వరకు నిఘా పెట్టి, దూకువస్తున్న క్షిపణులు, యుద్ధ విమానాలను గుర్తించి హెచ్చరించగలదు. యుద్ధం జరుగుతున్న ప్రాంతాల్లో శత్రువుల క్షిపణులు, ఫైటర్ల కదలికలపై నిరంతర నిఘా కోసం అద్భుతంగా పనిచేస్తుంది. ఈ విమానం విలువ సుమారు రూ.4,700 కోట్లు.

Updated Date - Mar 30 , 2026 | 04:22 AM