Share News

వలసదారులకు శరణు కోరే హక్కు ఉంది

ABN , Publish Date - Apr 26 , 2026 | 04:03 AM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు న్యాయస్థానంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. దేశ దక్షిణ సరిహద్దును దాటి వచ్చే వలసదార్లు తమను శరణార్థులుగా ...

వలసదారులకు శరణు కోరే హక్కు ఉంది

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 25: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు న్యాయస్థానంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. దేశ దక్షిణ సరిహద్దును దాటి వచ్చే వలసదార్లు తమను శరణార్థులుగా పరిగణించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోవడానికి వీల్లేదంటూ ఆయన తీసుకున్న నిర్ణయాన్ని కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్స్‌ కొట్టివేసింది. ఈ విధానం కారణంగా అక్రమ వలసలు తగ్గాయంటూ ప్రభుత్వం చేసిన వాదనతో ఏకీభవించలేదు. ప్రభుత్వ నిర్ణయం చట్టం పరిధిని దాటిందంటూ 2-1 మెజార్టీతో తీర్పు ఇచ్చింది. శరణార్థులకు రక్షణ కల్పించే విషయమై ప్రస్తుతం ఉన్న చట్టం పరిధిని దాటి అధ్యక్షుడు నిర్ణయం తీసుకోవచ్చా అనేదానిపై న్యాయస్థానం విచారణ జరిపింది. అలాంటి అధికారం అధ్యక్షుడికి లేదని తెలిపింది. శరణు కోరుతూ దరఖాస్తు చేసే హక్కు అమెరికాలో అడుగు పెట్టిన వలసదార్లకు ఉందని స్పష్టం చేసింది.

Updated Date - Apr 26 , 2026 | 04:03 AM