Share News

అపాచీ హెలికాప్టర్ల నిర్వహణకు అమెరికా ఓకే

ABN , Publish Date - Jun 23 , 2026 | 02:05 AM

భారత రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేసేలా అగ్రరాజ్యం అమెరికా ఓ శుభవార్త చెప్పింది. భారత్‌ వద్ద ఉన్న అపాచీ దాడి హెలికాప్టర్లు...

అపాచీ హెలికాప్టర్ల నిర్వహణకు అమెరికా ఓకే

వాషింగ్టన్‌, జూన్‌ 22: భారత రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేసేలా అగ్రరాజ్యం అమెరికా ఓ శుభవార్త చెప్పింది. భారత్‌ వద్ద ఉన్న అపాచీ దాడి హెలికాప్టర్లు, పర్వత శ్రేణుల్లో శత్రువులను వణికించే ఎం777ఏ2 ఆలా్ట్ర లైట్‌ హోవిట్జర్‌ ఫిరంగుల నిర్వహణకు అవసరమైన సాంకేతిక సహాయం, సిబ్బంది శిక్షణ, విడిభాగాలు విక్రయించే ప్రతిపాదనలకు అమెరికా అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు అమెరికాలో విదేశీ సైనిక అమ్మకాలను నిర్వహించే రక్షణ భద్రతా సహకార సంస్థ (డీఎస్సీఏ) ఈ నెల 17న అధికారికంగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ఒప్పందం ప్యాకేజీ అంచనా విలువ సుమారు రూ.4,050 కోట్లు.

Updated Date - Jun 23 , 2026 | 02:05 AM