గల్ఫ్ దేశాలకు రూ.1.53 లక్షల కోట్ల ఆయుధాలు
ABN , Publish Date - Mar 21 , 2026 | 03:48 AM
యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాలకు పెద్దఎత్తున ఆయుధాల అమ్మకానికి అమెరికా ఆమోదం తెలిపింది. యూఏఈ, కువైట్, జోర్డాన్‌లకు 16.5 బిలియన్ డాలర్లకు పైగా ...
అమ్మకానికి అమెరికా విదేశాంగ శాఖ ఆమోదం
వాషింగ్టన్, మార్చి 20: యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాలకు పెద్దఎత్తున ఆయుధాల అమ్మకానికి అమెరికా ఆమోదం తెలిపింది. యూఏఈ, కువైట్, జోర్డాన్‌లకు 16.5 బిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ.1.53 లక్షల కోట్లు) విలువైన ఆయుధాలను అందించేందుకు విదేశాంగ శాఖ గురువారం ఆమోద ముద్ర వేసింది. ఇజ్రాయెల్ దాడులకు స్పందనగా ఇరాన్ తమ దేశాల్లోని ఇంధన సదుపాయాలపై దాడులు చేస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ఇందులో భాగంగా యూఏఈకి అమెరికా 8 బిలియన్ డాలర్లకు పైగా విలువైన డ్రోన్లు, క్షిపణులు, ఎఫ్-16 యుద్ధ విమానాల ఆయుధాలను అందించనుంది. అదేవిధంగా కువైట్‌కు దాదాపు 8 బిలియన్ డాలర్ల విలువైన క్షిపణి రక్షణ, రాడార్ వ్యవస్థలను విక్రయించనుంది. జోర్డాన్‌కు యుద్ధ విమానాలు, మందుగుండు సామగ్రి రూపంలో 70.5 మిలియన్ డాలర్ల విలువైన ఆయుధ అమ్మకాలకు అమెరికా ఆమోదం తెలిపింది.