Share News

హెచ్‌-1బీ వీసాదారులకు ఇబ్బంది లేదు

ABN , Publish Date - May 26 , 2026 | 04:15 AM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇటీవల ప్రకటించిన గ్రీన్‌ కార్డ్‌ నూతన నిబంధనలపై తీవ్ర విమర్శలు రావడంతో ఈ విధానంపై పౌరసత్వ, వలస ...

హెచ్‌-1బీ వీసాదారులకు ఇబ్బంది లేదు

  • కొత్త గ్రీన్‌ కార్డ్‌ నిబంధనలపై అమెరికా వెల్లడి

వాషింగ్టన్‌, మే 25: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇటీవల ప్రకటించిన గ్రీన్‌ కార్డ్‌ నూతన నిబంధనలపై తీవ్ర విమర్శలు రావడంతో ఈ విధానంపై పౌరసత్వ, వలస సేవల విభాగం(యూఎస్‌సీఐఎస్‌) స్పష్టత ఇచ్చింది. హెచ్‌-1బీ వీసాదారులు, ఆర్థిక, జాతి ప్రయోజనాల కోసం కృషి చేసే వారు అమెరికాకు ఆవల నుంచి గ్రీన్‌ కార్డ్‌ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. ముఖ్యంగా హెచ్‌-1బీ వీసాదారులు శాశ్వత నివాసం కోసం ప్రస్తుతమున్న స్థితిని కొనసాగిస్తూనే దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఇతరులు మాత్రం అమెరికా ఆవల నుంచే దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కాగా, గ్రీన్‌ కార్డుకు సంబంధించి ఇటీవల ప్రకటించిన నిబంధనలను యూఎస్‌సీఐఎస్‌ అధికార ప్రతినిధి సమర్థించుకున్నారు. గ్రీన్‌ కార్డులను సరైన రీతిలో వినియోగించుకోవాలన్న ఉద్దేశంతోనే కొత్త నిబంధనలు తీసుకువచ్చినట్టు తెలిపారు.

Updated Date - May 26 , 2026 | 04:15 AM