అమెరికా పౌరసత్వం మరింత ప్రియం!
ABN , Publish Date - Jun 24 , 2026 | 03:31 AM
అగ్రరాజ్యం అమెరికా పౌరసత్వం పొందాలనేది లక్షలాది మంది కల. అక్కడకు వెళ్లి ఉద్యోగాలు చేసేవారు.. ఏదో ఒకనాడు గ్రీన్‌కార్డు సొంతం...
వాషింగ్టన్, జూన్ 23: అగ్రరాజ్యం అమెరికా పౌరసత్వం పొందాలనేది లక్షలాది మంది కల. అక్కడకు వెళ్లి ఉద్యోగాలు చేసేవారు.. ఏదో ఒకనాడు గ్రీన్‌కార్డు సొంతం చేసుకోవాలని భావిస్తారు. అయితే.. ఇప్పుడు ఈ ప్రక్రియ అత్యంత ఖరీదుగా మారనుంది. పౌరసత్వ దరఖాస్తు ఫీజును ఏకంగా 75ు పెంచాలని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రతిపాదించింది. దీనికి ఆమోదముద్ర పడితే ప్రస్తుతం ఉన్న పౌరసత్వ దరఖాస్తు రుసుము 760 డాలర్ల నుంచి 1330 డాలర్లకు చేరుకుంటుంది. భారత కరెన్సీలో ప్రస్తుతం రూ.71,983గా ఉన్న దరఖాస్తు రుసుము ఏకంగా రూ.1,25,970లకు చేరుకుంటుంది. అంతేకాదు, ప్రస్తుతం కొందరికి ఆదాయం, సామాజిక స్థితి ఆధారంగా దరఖాస్తు ఫీజులో రాయితీలు, మినహాయింపులు ఇస్తున్నారు. కానీ, ఇకపై వీటిని పూర్తిగా తొలగించాలని హోంల్యాండ్ మరో కీలక ప్రతిపాదన చేసింది. ఇది ప్రతిపాదన మాత్రమేనని, ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తామని హోంల్యాండ్ తెలిపింది.