Share News

అమెరికాలో 3లక్షల వీసాల రద్దు!

ABN , Publish Date - Oct 22 , 2026 | 04:35 AM

అమెరికాలోని ట్రంప్‌ ప్రభుత్వం 2025 నుంచి ఇప్పటివరకు 3లక్షలకు పైగా యూఎస్‌ వీసాలను రద్దు చేసినట్లు ప్రకటించింది.

అమెరికాలో 3లక్షల వీసాల రద్దు!

వాషింగ్టన్‌, అక్టోబరు 21: అమెరికాలోని ట్రంప్‌ ప్రభుత్వం 2025 నుంచి ఇప్పటివరకు 3లక్షలకు పైగా యూఎస్‌ వీసాలను రద్దు చేసినట్లు ప్రకటించింది. చట్టాలను ఉల్లంఘించినా, మోసాలకు పాల్పడినా, జాతీయభద్రతకు విఘాతం కలిగించినా సహించేది లేదని ట్రంప్‌ ప్రభుత్వం మంగళవారం ఓ ప్రకటనలో తేల్చి చెప్పింది. దేశీయ భద్రతను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ డిపోర్టేషన్‌ చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేసింది. 2026 ఆగస్టు నాటికి రద్దయిన వీసాల సంఖ్య 1.75వేలు ఉండగా, సెప్టెంబర్‌ చివరినాటికి ఆ సంఖ్య మూడు లక్షల మార్కును దాటింది. అమెరికా చరిత్రలో రెండు నెలల వ్యవధిలోనే ఈ స్థాయిలో వీసాలు రద్దు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Updated Date - Oct 22 , 2026 | 04:36 AM