పశ్చిమాసియా మిత్రులకు అమెరికా ఆయుధాలు
ABN , Publish Date - May 03 , 2026 | 04:12 AM
పశ్చిమాసియాలోని తన మిత్రదేశాలకు అమెరికా భారీగా ఆయుధాలు విక్రయించడానికి రంగం సిద్ధం చేసింది. ఇజ్రాయెల్, కువైట్, ఖతార్, యూఏఈలకు 8.6 బిలియన్ డాలర్ల(సుమారు...
81వేల కోట్ల విలువైన విక్రయాలకు సిద్ధం
దీని కోసం కాంగ్రెస్ రివ్యూ కూడా బైపాస్
ఇరాన్‌పై యుద్ధం ముగిసిందని చట్ట సభ్యులకు తెలిపిన ట్రంప్
న్యూఢిల్లీ, మే 2: పశ్చిమాసియాలోని తన మిత్రదేశాలకు అమెరికా భారీగా ఆయుధాలు విక్రయించడానికి రంగం సిద్ధం చేసింది. ఇజ్రాయెల్, కువైట్, ఖతార్, యూఏఈలకు 8.6 బిలియన్ డాలర్ల(సుమారు రూ.81వేల కోట్లు) విలువైన ఆయుధాల విక్రయాలకు ఆమోదం తెలుపుతున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ చెప్పింది. ఈ ఆయుధాల విక్రయ ప్రతిపాదన కోసం అమెరికా ప్రభుత్వం కాంగ్రెస్ సమీక్షను కూడా బైపాస్ చేసింది. ఇదిలా ఉండగా, 1973లో ఆమోదించిన యుద్ధ అధికారాల తీర్మానం ప్రకారం అమెరికా అధ్యక్షుడు యుద్ధ విషయాన్ని కాంగ్రెస్‌కు తెలిపిన తర్వాత ఆ యుద్ధాన్ని కొనసాగించడానికి కాంగ్రెస్ అంగీకారం తెలిపితే తప్ప 60 రోజుల్లోపు దానిని ముగించాల్సి ఉంటుంది.ఈ నిబంధన ప్రకారం కాంగ్రెస్ అనుమతి లేకుండానే ఇరాన్‌పై అధ్యక్షుడు ట్రంప్ సైనికచర్య మొదలుపెట్టారు. దీనికి కాంగ్రెస్ అనుమతి తీసుకోవాల్సిన గడువు సమీపిస్తోంది.ఈ నేపథ్యంలో ఇరాన్‌పైయుద్ధం ‘ముగిసింది’ అని చట్ట సభ్యులకు ట్రంప్ చెప్పారు. ఏప్రిల్ 7 తర్వాత ఇరు దేశాల మధ్య కాల్పులు జరగలేదని, ఇరు దేశాల మధ్య ఫిబ్రవరి 28న మొదలైన ఘర్షణలు ముగిశాయి అని చట్ట సభ్యులకు రాసిన లేఖలో ట్రంప్ పేర్కొన్నారు.